ETV Bharat / entertainment

బాలయ్యపై బాలీవుడ్ యాక్టర్​ ప్రశంసలు.. అలా చూసి ఆశ్చర్యపోయారట!

author img

By

Published : Dec 29, 2022, 12:45 PM IST

Updated : Dec 29, 2022, 3:29 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణపై ఓ బాలీవుడ్​ యాక్టర్​ ప్రశంసలు కురిపించారు. బాలయ్యను అలా చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పారు.

bollywood actor praises Balakrishna
బాలయ్యపై బాలీవుడ్ యాక్టర్​ ప్రశంసలు.. అలా చూసి ఆశ్చర్యపోయారట!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'వీరసింహారెడ్డి'. శ్రుతి హాసన్‌ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని మూడు పాటలు సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం రిలీజ్​ కానుంది. అయితే ఈ మూవీలో హిందీ యాక్టర్​ రోహిత్‌ పాఠక్‌ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. బాలకృష్ణతో కలిసి పనిచేసిన అనుభవాన్ని తెలిపారు. అలాగే వీరసింహారెడ్డిలో తన పాత్ర గురించి వివరించారు.

"వీరసింహారెడ్డి సినిమాలో నేను నార్త్‌కు చెందిన కాంట్రాక్ట్‌ కిల్లర్‌గా కనిపిస్తాను. నా పాత్ర సినిమాకే కీలకం అవుతుంది. దీనితో సినిమాలోని కథ మొత్తం మలుపు తిరుగుతుంది. తీవ్రమైన ప్రతికారం తీర్చుకునే పాత్ర అది. బాలకృష్ణకు, నాకు మధ్య జరిగే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇంతకు మించి నా పాత్ర గురించి ఎక్కువ వివరాలు చెప్పలేను" అన్నారు.

ఇక బాలకృష్ణతో పనిచేసిన అనుభవాన్ని గురించి మాట్లాడుతూ.. ఆయన వినయం ఆకట్టుకుందని తెలిపారు. "రామోజీ ఫిల్మ్‌ సిటీలో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు నేను వెళ్లాను. బాలకృష్ణ దగ్గరకు వెళ్లి నన్ను పరిచయం చేసుకున్నాను. వెంటనే ఆయన 'మీ గురించి నాకు తెలుసు' అని నవ్వారు. ఆయన అలా చెప్పడంతో నేను ఆశ్చర్యపోయాను. ఆయనతో పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది" అని రోహిత్‌ వివరించారు. కాగా, ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్‌ నటించింది.

rohith pathak praises on balakrishna
రోహిత్‌ పాఠక్‌

ఇదీ చూడండి: ఏంటి రష్మిక ఇలా చేస్తున్నావ్​ ఫ్యాన్స్​ ఫుల్​ ఫైర్ అవుతున్నారుగా

Last Updated : Dec 29, 2022, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.