ETV Bharat / entertainment

'దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..' బాలయ్య అన్​స్టాపబుల్​-2 ప్రోమో టీజర్ అదుర్స్

author img

By

Published : Oct 4, 2022, 9:40 PM IST

Unstoppable Season 2 : నటరత్న నందమూరి బాలకృష్ణ హోస్ట్​గా చేస్తున్న అన్​స్టాపబుల్ టాక్​ షో సీజన్​-2తో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. భారీ స్థాయిలో ప్రోమో షూట్, అందుకు తగిన రేంజ్​లోనే విజయవాడలో రిలీజ్​తో అంతకంతకూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా అన్​స్టాపబుల్​ సీజన్​-2 ప్రోమో టీజర్ విడుదలైంది.

Unstoppable Season 2
Unstoppable Season 2

Unstoppable Season 2 : టాలీవుడ్​ అగ్ర నటుడు బాలకృష్ణ చేస్తున్న అన్​స్టాపబుల్​ రెండో సీజన్ ప్రోమో ఎలా ఉంటుంది?. షోలో గెస్ట్​లుగా ఎవరు వస్తారు? తొలి ఎపిసోడ్​ అతిథి ఎవరు? అనే విషయాలపై సీజన్​-1 ముగిసినప్పటి నుంచే చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో ఓ ఫొటో.. నెట్టింట చర్చనీయాంశమైంది. అనంతరం ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే అన్​స్టాపబుల్​ సెట్​ దగ్గర.. ఆంధ్రప్రదేశ్​ మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో బాలయ్య ఉన్న ఫొటో బయటకు వచ్చింది. దీంతో.. అన్​స్టాపబుల్ రెండో సీజన్​ చంద్రబాబు ఎపిసోడ్​తోనే ప్రారంభం కావచ్చని టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో అన్​స్టాపబుల్​ రెండో సీజన్ ప్రోమో టీజర్ విడుదల చేశారు. అయితే ఈ షో ప్రోమో రిలీజ్ ఈవెంట్​ను ఘనంగా ప్లాన్​ చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అన్​స్టాపబుల్​ సీజన్​-1కు తొలి గెస్ట్​గా దిగ్గజ నటుడు మోహన్ బాబును ఆహ్వానించారు. ఆ ఎపిసోడ్​లో మోహన్​ బాబుతో కలిసి బాలయ్య చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ తర్వాత వచ్చిన ఎపిసోడ్లలోనూ కుర్ర నటులతో కలిసి అదే స్థాయిలో హడావుడి చేశారు. పెళ్లి విషయంలో రానాను టీజ్ చేసి, నానితో కలిసి క్రికెట్ ఆడి, అల్లు అర్జున్​తో కలిసి పుష్ప స్టెప్పులేసి.. సెట్​లో దుమ్మురేపారు బాలకృష్ణ. సూపర్​స్టార్ మహేశ్​ బాబుతో సీజన్​-1కు గ్రాండ్​ ఫినిషింగ్ ఇచ్చారు.

ఇవీ చదవండి: పంత్​కు ఊర్వశి 'స్పెషల్' బర్త్​డే విషెస్.. రెడ్ హాట్ లుక్​లో ఫ్లయింగ్ కిస్..

'ఈ ఏడాది బ్రహ్మాస్త్ర సినిమానే 'నెంబర్ 1'.. పార్ట్​2 విడుదల అప్పుడే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.