ETV Bharat / entertainment

Anchor Suma Son Movie : యాంకర్ సుమ కొడుకు ఫస్ట్ మూవీ టీజర్ చూశారా..? ఘాటు లిప్‌ లాక్ - బోల్డ్ సీన్స్​తో.. ​

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 3:41 PM IST

Updated : Oct 10, 2023, 4:17 PM IST

Anchor Suma Son Roshan Movie Teaser : ప్రముఖ యాంకర్ సుమ కనకాల కొడుకు ఫస్ట్ మూవీ టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. యూత్​కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.

Anchor Suma Son Movie : యాంకర్ సుమ కొడుకు ఫస్ట్ మూవీ టీజర్ చూశారా..? ఘాటు లిప్‌లాక్, బోల్డ్ సీన్స్​తో.. ​
Anchor Suma Son Movie : యాంకర్ సుమ కొడుకు ఫస్ట్ మూవీ టీజర్ చూశారా..? ఘాటు లిప్‌లాక్, బోల్డ్ సీన్స్​తో.. ​

Anchor Suma Son Roshan Movie Teaser : ప్రముఖ యాంకర్ సుమ కనకాల, సీనియర్ నటుడు రాజీవ్ కనకాల దంపతుల కుమారుడు రోషన్ కనకాల హీరోగా నటించిన తొలి సినిమా 'బబుల్ గమ్' టీజర్​ రిలీజైంది. ఈ చిత్రంలో మానస చౌదరీ హీరోయిన్‍గా చేస్తోంది. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రవికాంత్ పారెపు ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఆ టీజర్ ఆద్యంతం లిప్‍లాక్‍లు, కొన్ని బోల్డ్ డైలాగ్‍లతో ఆకట్టుకుంటోంది.

ప్రేమ అనేది బబుల్‍గమ్ లాంటిది, ముందు తియ్యగా ఉన్నా ఆ తర్వాత అంటుకుంటది. అంత ఈజీ కాదు. పండబెట్టేస్తది అంటూ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ మొదలైంది. పబ్‍లో డీజే ఆపరేటర్‌గా పని చేస్తూ కనిపించాడు హీరో రోషన్ కనకాల. ఆ తర్వాత హీరోయిన్‍ను పబ్‍లో చూసి ప్రేమలో రోషన్ ప్రేమలో పడటం, ఇద్దరూ లవల్​లో మునిగి తేలడం వంటి సీన్స్​ను చూపించారు. ఆ తర్వాత రోషన్ గురించి నిజం తెలిసి హీరోయిన్ గొడవ పడటం, 'నచ్చినట్టు మార్చుకుంటా, కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా' అంటూ హీరో ఎమోషనల్​ అవ్వడం వంటివి చూపించారు. ఫైనల్​గా సముద్రం ఒడ్డున హీరోహీరోయిన్ లిక్‍లాక్‍తో టీజర్​ను ముగించారు. మొత్తంగా బోల్డ్ కంటెంట్‍తో లవ్‌,రొమాన్స్‌, యాక్షన్‌.. ఇలా అన్ని అంశాలతో యూత్‌ఫల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇందులో కొన్ని బూతు డైలాగ్​లు కూడా ఉన్నాయి.

ఇకపోతే ఈ చిత్రాన్ని 'క్షణం', 'కృష్ణ అండ్ లీల' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రవికాంత్ పారెపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. సురేష్ రగుతు - సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పి.విమల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో వైవా హర్ష, అనన్య ఆకుల, కిరణ్, అను హసన్, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, జైరామ్ ఈశ్వర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Samantha Latest Photos : శారీలో సామ్.. ట్రెండీ​ అవుట్​ఫిట్​లో సదా, మిర్నా మెరుపులు

Mrunal Thakur Latest Interview : 'ఆ ప్రశ్న నన్ను ఎప్పుడూ అడుగుతుంటారు'

Last Updated : Oct 10, 2023, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.