20 ఏళ్ల తర్వాత జంటగా వెంకీ మామ- భూమిక.. డ్యాన్స్​ సూపర్​!

author img

By

Published : Mar 4, 2023, 10:09 PM IST

Updated : Mar 4, 2023, 10:18 PM IST

after-20-years-venkatesh-bhumika-chawla-are-acting-as-a-couple

టాలీవుడ్​లో సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న జంటల్లో వెంకటేశ్​- భూమిక జోడీ ఒకటి. వీరిద్దరూ కలిసి చేసింది ఒక్క సినిమానే అయినా.. వీరి జంటకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే తాజాగా వీరిద్దరూ మరో సినిమాలో జంటగా నటిస్తున్నారు. ఆ వివరాలు..

వెండితెరపై కొంతమంది హీరోహీరోయిన్ల జంటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఒక్కసారి హిట్టు కొట్టాక.. మళ్లీ వారి కాంబినేషన్​లో ఇంకో సినిమా వస్తే బాగుంటుంది అనే ఫీల్ చాలా మంది ప్రేక్షకుల్లో కలుగుతుంది. అలా టాలీవుడ్​లో సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న జంటల్లో వెంకటేశ్​- భూమిక జోడీ ఒకటి. వీరిద్దరూ కలిసి చేసింది ఒక్క సినిమానే అయినా.. వీరి జంటకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దాదాపు 20 సంవత్సరాల క్రితం.. 2002లో వెంకీ, భూమిక.. వాసు సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా.. వీరి కెమిస్ట్రీకి మాత్రం ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వీరి కాంబినేషన్​లో మరో సినిమా వస్తే బాగుంటుందని అంతా భావించారు. కానీ.. ఆ తర్వాత వీరు జంటగా నటించే అవకాశం రాలేదు.

తాజాగా వీరి కాంబినేషన్ గురించి లేటెస్ట్​గా ఓ క్రేజీ సర్ప్రైజ్ బయటికి వచ్చింది. 20 ఏళ్ల తర్వాత వెంకటేశ్​ భూమిక జంటగా ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు. కాకపోతే.. ఈసారి హీరోహీరోయిన్ క్యారెక్టర్స్​లో మాత్రం కాదు. వేరే హీరో సినిమాలో వీరిద్దరూ జంటగా మెరవనున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్, పూజ హెగ్డే జంటగా కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ నుంచి వెంకీ, రానా, జగపతిబాబు కూడా నటిస్తున్నారు.

ఇటీవలే మేకర్స్ ఈ సినిమా నుంచి బిల్లీ బిల్లీ అంటూ కొత్త వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. సర్ప్రైజింగ్​గా ఈ సాంగ్​లో వెంకీకి జోడీగా భూమిక ప్రత్యక్షమైంది. ఈ సాంగ్​లో వీరిద్దరూ జంటగా స్టెప్పులు వేస్తూ కనిపించారు. దీంతో వెంకీ, భూమిక వేసిన డ్యాన్సులు చూసి ఆడియన్స్ అవాక్కయ్యారు. ఇన్నేళ్ల తర్వాత వారిద్దరూ జంటగా కనిపించనున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీరు జంటగా స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
Last Updated :Mar 4, 2023, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.