ETV Bharat / entertainment

మెగాస్టార్​ ఇంట్లో 'లాల్​ సింగ్​ చద్ధా' ప్రత్యేక ప్రివ్యూ.. హాజరైన టాలీవుడ్​ ప్రముఖులు

author img

By

Published : Jul 14, 2022, 7:26 PM IST

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ఖాన్‌ న‌టించిన‌ 'లాల్​ సింగ్​ చద్ధా' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నేపథ్యంలో టాలీవుడ్​ ప్రముఖుల కోసం.. ఆమిర్‌ఖాన్‌ మిత్రుడు మెగాస్టార్​ చిరంజీవి ఇంట్లో సినిమా ప్రత్యేక ప్రివ్యూ వేశారు ఆమిర్​ఖాన్​.

Aamir Khan arranges Laal Singh Chaddha premiere in Hyderabad. Rajamouli, Nagarjuna and Chiranjeevi attend
మెగాస్టార్​ ఇంట్లో 'లాల్​ సింగ్​ చద్ధా' ప్రత్యేక ప్రివ్యూ.. హాజరైన టాలీవుడ్​ ప్రముఖులు

బాలీవుడ్‌ స్టార్​ హీరో ఆమిర్‌ఖాన్‌, మెగాస్టార్ చిరంజీవి మంచి స్నేహితులు. చాలా ఏళ్లుగా వీరి స్నేహ బంధం కొనసాగుతోంది. అయితే ఆమిర్‌ఖాన్‌ న‌టించిన‌ 'లాల్​ సింగ్​ చద్ధా' సినిమా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో తన మిత్రుడు మెగాస్టార్​ చిరంజీవితోపాటు.. ఇతర టాలీవుడ్​ ప్రముఖుల కోసం ప్రివ్యూ వేశారు ఆమీర్​.

చిరంజీవి నివాసంలో ఈ సినిమా ప్రత్యేక ప్రివ్యూ జరగ్గా.. ప్రత్యేక అతిథులుగా కింగ్ నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, స్టార్​ డైరెక్టర్లు ఎస్ఎస్.రాజమౌళి, సుకుమార్ హాజరై వీక్షించారు. చూసిన ప్రముఖులంతా.. సినిమా ప‌ట్ల ఎంతో సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ఆమిర్‌ఖాన్‌ తెరకెక్కించారు. కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, ప్రత్యేక పాత్రలో అక్కినేని నాగ చైతన్య నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

Aamir Khan arranges Laal Singh Chaddha premiere in Hyderabad. Rajamouli, Nagarjuna and Chiranjeevi attend
'లాల్​ సింగ్​ చద్ధా' ప్రత్యేక ప్రివ్యూ.. హాజరైన టాలీవుడ్​ ప్రముఖులు

ఇదీ చదవండి: జబర్దస్త్ ఫైమా సొంతింటి కల సాకారం.. రింగు తొడిగి ప్రవీణ్ ప్రపోజల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.