ETV Bharat / entertainment

తెలుగులోనూ '2018' బ్లాక్‌బస్టర్ హిట్.. 10 రోజుల్లో రూ.10 కోట్లు!

author img

By

Published : Jun 5, 2023, 10:14 PM IST

2018 Telugu Movie Collections : తెలుగులోనూ '2018' బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఇక్కడ కూడా ఈ మలయాళ సినిమాకు భారీ లాభాలు వచ్చాయి. మరోవైపు, థియేట‌ర్ల‌లో విడుద‌లైన ప‌ది రోజుల్లోనే '2018' తెలుగువెర్ష‌న్ ఓటీటీలో రిలీజ్ కానుంది.

2018 Telugu Movie Collections
2018 Telugu Movie Collections

2018 Telugu Movie Collections : మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో అద్భుతమైన సినిమా '2018'. మలయాళం ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ఈ సినిమా.. తెలుగులో విడుదలై అదే వేగంతో దూసుకెళ్తోంది. టాలీవుడ్​లోనూ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి.. బయర్లపై లాభాల వర్షం కురిపించింది.

ట్రేడ్​ వర్గాల సమాచారం ప్రకారం.. టొవినో థామస్ నటించిన 2018 మూవీ 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.9.22 కోట్లు వసూలు చేసింది. నైజాం ఏరియాలో రూ.4.35 కోట్లు, ఆంధ్రా, సీడెడ్ లో కలిపి రూ.4.87 కోట్లు వచ్చాయి. మొత్తంగా రూ.9.22 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కాగా.. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.4.34 కోట్లు. ఈ సినిమా తెలుగులో ఓవరాల్ బిజినెస్ రూ.1.8 కోట్లుగా ఉంది. బ్రేక్ ఈవెన్ రూ.2 కోట్లు కాగా.. ఇప్పటికే రూ.2.34 కోట్ల లాభాలు వచ్చాయి.

2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. మొదట కేవలం మలయాళంలో రిలీజ్ కాగా.. తర్వాత కొన్ని రోజులకు తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీల్లోనూ విడుదల చేశారు. తెలుగులో తొలి మూడు రోజుల్లోనే రూ.4.33 కోట్లు వసూలు చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2018 Movie OTT Release Date : థియేట‌ర్ల‌లో విడుద‌లైన ప‌ది రోజుల్లోనే 2018 తెలుగు వెర్ష‌న్ ఓటీటీలో రిలీజ్ కానుంది. జూన్ 7న 2018 మ‌ల‌యాళం వెర్ష‌న్ మాత్ర‌మే ఓటీటీలో రిలీజ్ చేస్తున్న‌ట్లు సోనిలివ్ ప్ర‌క‌టించింది. తెలుగు వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో ఆడుతుండ‌టం వల్ల ఆల‌స్యంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ నిర్మాత‌ల‌కు షాకిస్తూ మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో అదే రోజు ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్లు సోనిలివ్ ప్ర‌క‌టించింది.

బిచ్చగాడు 2 సూపర్ హిట్.. ఎన్ని లాభాలో తెలుసా?
Bichagadu 2 Collections : బిచ్చగాడు పార్ట్-1 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి దుమ్మురేపగా.. సీక్వెల్ మాత్రం భారీ అంచనాల మధ్య రిలీజై.. అందుకు తగినట్లే లాభాలు ఆర్జించింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా బిచ్చగాడు-2 రూ.9.1 కోట్లు వసూలు చేయడం విశేషం.

ట్రేడ్​ వర్గాల సమాచారం ప్రకారం.. నైజాం ఏరియాలో ఈ మూవీని రూ.1.5 కోట్లకు కొనుగోలు చేయగా.. రూ.2.5 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక సీడెడ్ లో రూ.1 కోటికిగాను రూ.3 కోట్ల షేర్ వచ్చింది. ఆంధ్రా ఏరియాలో రూ.2.5 కోట్లకు కొనుగోలు చేయగా.. రూ.4.6 కోట్లు వచ్చాయి. 2016లో వచ్చిన బిచ్చగాడు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.14 కోట్లు వసూలు చేసింది.

Bichagadu 2 OTT Release Date : ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ రిలీజ్‌కు ముందే సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా జూన్ 23 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు త‌మిళ భాష‌లో అదే రోజు రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం. ఈ మూవీలో కావ్య థాప‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాతోనే విజ‌య్ ఆంటోనీ ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేసి తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యాన్ని అందుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.