ETV Bharat / entertainment

'పుష్ప 2' ఓటీటీ రైట్స్.. ఆ రెండు బడా సంస్థల మధ్య ఫైట్​!

author img

By

Published : May 16, 2022, 8:52 PM IST

Puspha 2 OTT Rights: 'పుష్ప 2' ఓటీటీ రైట్స్​ కోసం రెండు బడా సంస్థలు తీవ్రంగా పోటీ పడుతున్నాయని తెలిసింది. డిజిటల్​ హక్కుల కోసం భారీ మొత్తాన్ని చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయట.

pushpa 2 ott rights
పుష్ప 2 ఓటీటీ రైట్స్​

Puspha 2 OTT Rights: 'పుష్ప: ది రైజ్​' చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్‌. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తెలుగు, మ‌ల‌యాళం, హిందీతోపాటు మిగిలిన భాష‌ల్లో మంచి టాక్‌తో పాటు క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. ఓటీటీ అమెజాన్​ ప్రైమ్​లోనూ విడుదలైన ఈ మూవీ విశేష ఆదరణను అందుకుంది. అయితే ఈ మూవీలో చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండానే వదిలేశారు‌ సుకుమార్​. దీంతో మలి భాగంలో ఏం చూపించబోతున్నారా? అన్న ఆసక్తి అభిమానుల్లో విపరీతంగా ఉంది. దీని కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఇంకా సెట్స్​పైకి వెళ్లని ఈ రెండో భాగం గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్​ వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రం పోస్ట్​ థియేట్రికల్​ ఓటీటీ రైట్స్​ కొనగోలుకు ఫుల్​ డిమాండ్​ పెరిగిందట! వాటిని సొంతం చేసుకునేందుకు రెండు బడా సంస్థలు తీవ్రంగా పోటీ పడుతున్నాయని తెలిసింది. అమెజాన్​ ప్రైమ్​ వీడియో, డిస్నీ ప్లస్​ హాట్​స్టార్.. ఈ ఓటీటీ రైట్స్​ను కొనుగోలు చేసేందుకు విపరీతంగా ఆసక్తి చూపుతున్నాయట. ఇందుకోసం భారీ మొత్తాన్ని ముందుగానే చెల్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇక నిర్మాతలు కూడా సినిమా ప్రారంభానికి ముందే ఈ రెండింటిలో ఓ సంస్థతో భారీ మొత్తానికి డీల్​ను ఓకే చేయాలని భావిస్తున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

కాగా, తొలి భాగంలో ఒక సాధారణ కూలీగా జీవితం మొదలు పెట్టిన పుష్పరాజ్‌ ఎర్రచందనం స్మగ్లింగ్‌ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదగాడన్నది అదిరిపోయేలా చూపించారు దర్శకుడు సుకుమార్‌. బన్నీ మాస్​గెటప్​, నటన, దేవీ శ్రీ ప్రసాద్​ మ్యూజిక్​​ సినిమాకే హైలైట్​గా నిలిచాయి. స్టార్​ హీరోయిన్​ సమంత చిందులేసిన 'ఊ అంటావా మావ' స్పెషల్​ సాంగ్​ దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. క‌న్న‌డ భామ ర‌ష్మిక ఈ చిత్రంలో శ్రీవ‌ల్లిగా డీ గ్లామ‌ర్ పాత్ర‌లో న‌టించి.. ఓ రేంజ్​లో పాపులారిటీ సంపాదించుకుంది.

ఇదీ చూడండి: హాట్​బ్యూటీతో బాలయ్య ఆటాపాట.. వెంకీ చెల్లిలిగా పూజాహెగ్డే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.