ETV Bharat / crime

బెయిల్ ఇప్పిస్తారు.. స్మగ్లింగ్​ చేయిస్తారు.. వీళ్ల నెట్​వర్క్​ చూస్తే మైండ్​ బ్లాక్​!

author img

By

Published : Jan 6, 2023, 2:06 PM IST

drug Smugglers Network
బెయిల్ ఇప్పిస్తారు.. స్మగ్లింగ్​ చేయిస్తారు.. వీళ్ల నెట్​వర్క్​ చూస్తే మైండ్​ బ్లాక్​!

drug Smugglers Network: డ్రగ్స్ స్మగ్లింగ్ గురించి.. వారి నెట్​వర్క్ గురించి చాలా సినిమాల్లోనే మనం చూసుంటాం. అలాంటి సీన్​లు కేవలం సినిమాల వరకే పరిమితం అనుకుంటాం. కానీ రియల్ లైఫ్​లోనూ ఇలాంటివి జరుగుతున్నాయి. రీల్​లో చూసినట్టుగానే రియల్​ లైఫ్​లోనూ డ్రగ్ డీలర్స్ తమ నెట్​వర్క్​ను పకడ్బందీగా రూపొందించుకుంటారు. అలా తెలంగాణలో విస్తరించిన ఓ కరుడుగట్టిన డ్రగ్ స్మగ్లింగ్ నెట్​వర్క్ గురించి తెలుసుకుందామా..?

drug Smugglers Network: గల్లీలో గంజాయి.. పబ్‌ల్లో కొకైన్‌ ప్యాకెట్లు అమ్మారు.. పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లివస్తారు. అనంతరం స్మగ్లర్లుగా ఎదిగి.. పాన్‌ఇండియా స్థాయిలో నెట్‌వర్క్‌ పెంచుకొని విస్తరిస్తుంటారు. తమ వద్ద పని చేసేవాళ్లకు ఎంతైనా ఖర్చుచేసేందుకు సిద్ధపడుతుంటారు. ఒకవేళ పోలీసులకు పట్టుబడినా తొలగించిన సందేశాలు, ఫొటోలను తిరిగి సేకరించేందుకు.. ఎవరికీ తెలియని కొత్త యాప్‌లను వినియోగిస్తున్నారు. ఇది ఏదో సినిమా స్టోరీ అనుకుంటే పొరపడినట్లే.. ఈ మధ్యే పోలీసులకు చిక్కిన స్మగ్లర్స్​ ఆగడాలు..

నేరస్థులను పట్టుకునేందుకు పోలీసులు వేసిన వ్యూహం, ఆధారాలను సేకరించి.. ఈ విలువైన సమాచారం కమీషన్​లకు కక్కుర్తి పడి కొందరు విశ్రాంత పోలీసు అధికారులు ద్వారా స్మగ్లర్లు సేకరిస్తున్నారు. ఈ స్మగ్లర్లు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. నేర పరిశోధనకు అవలంభిస్తున్న విధానాలను ముందుగానే పసిగడుతున్నారు. వీరు ఎలా ఉంటారంటే పోలీసులు కంటే ముందుగానే వీరి చర్యలు ఉండే విధంగా ఉంటాయి. అంటే అర్థం చేసుకోవచ్చు వారి మనుగడ ఎంతలా వ్యాపించి ఉందో..

ఈ విధంగానే డ్రగ్స్‌ కేసులో డీజే మోహిత్‌ అగర్వాల్‌ను పట్టుకునేందుకు తెలంగాణలోని హైదరాబాద్​ పోలీసులు గోవా వెళ్లారు. విషయం ముందుగానే తెలుసుకున్న అతను హైదరాబాద్​ వచ్చాడు. అప్పటికే ఇక్కడ సిద్ధంగా ఉన్న పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. అలానే గోవా డ్రగ్‌ కింగ్‌పిన్‌ ఎడ్విన్‌ న్యూన్స్‌ హైదరాబాద్‌ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రోజుల తరబడి అజ్ఞాతంలో గడిపాడు. 20 మంది బౌన్సర్లతో భద్రత ఏర్పాటు చేసుకున్నాడు. అదేవిధంగా విశాఖ ఏజెన్సీలోని గ్రామాలను అడ్డాగా మార్చుకొని హ్యాష్‌ ఆయిల్‌ తయారీలో ఆరితేరాడు ప్రవీణ్‌కుమార్‌. ఇతను ఎప్పుడు ఎక్కడ ఉంటాడనేది అంచనా వేసేందుకు పోలీసులకు 30 రోజులు పట్టిందంటే.. అంటే వీరి అందరి నెట్​వర్క్​ ఎంతలా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు.

అనుచరులుగా మార్చుకొని: స్మగ్లర్లు లేదా పెడ్లర్లు జైళ్లలో ఉన్నపుడు మాదకద్రవ్యాల కేసుల్లో రిమాండ్‌ లేదా శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో మాట కలుపుతారు. బెయిల్‌ కోసం ఎదురుచూసే వారి ఆర్థిక స్థితిగతులు అంచనా వేస్తారు. జైలు నుంచి విడుదలయ్యాక.. తాము నమ్మకస్థులుగా గుర్తించిన ఖైదీలను సైతం బెయిల్‌పై బయటకు తీసుకొస్తున్నారు. అనుచరులుగా మార్చుకొని వారి ద్వారా మాదకద్రవ్యాలు సరఫరా చేయిస్తున్నారు. హ్యాష్‌ ఆయిల్‌ కేసులో అరెస్టయిన ప్రవీణ్‌ తన ఆదాయంలో మూడో వంతు గంజాయి కేసులో అరెస్టయిన వారి బెయిల్‌ కోసమే వెచ్చించేవాడని పోలీసు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.