ETV Bharat / city

పోలీసు వ్యవస్థను జగన్ సర్కార్‌... రాజకీయ కక్ష సాధింపు సంస్థగా మార్చింది

author img

By

Published : Oct 1, 2022, 5:29 PM IST

Nara Lokesh on CID police
నారా లోకేశ్​

TD Leaders on CID police: హైదరాబాద్‌లో అయ్యన్న కుమారుడు విజయ్‌ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్​లతో పాటు పలువురు నేతలు ఖండించారు. అక్రమ అరెస్టుకు యత్నించడం దారుణమని ధ్వజమెత్తారు. నోటీసు ఇచ్చేందుకు వెళ్లి డ్రైవర్‌పై ఎందుకు దాడి చేశారని ధ్వజమెత్తారు.

CBN on CID police: చింతకాయల విజయ్ ఇంట్లోకి దొంగల్లా వెళ్లడాన్ని ఖండిస్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఇంటికెళ్లి పిల్లలు, పనివాళ్లను భయపెట్టడం దారుణమని విమర్శించారు. నోటీసు ఇచ్చేందుకు వచ్చి డ్రైవర్‌పై ఎందుకు దాడి చేశారని నిలదీశారు. కేసులు, విచారణ పేరుతో పోలీసులను రౌడీల్లా ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. అయ్యన్న కుటుంబంపై ఆదినుంచి ప్రభుత్వ వైఖరి కక్షపూరితంగా ఉందని ఆరోపించారు. గతంలో నర్సీపట్నంలో అయ్యన్న ఇంటిపై ఇలాగే దాడి చేశారన్నారు. రోజుకో సీఐడీ కేసు, వారానికో అరెస్టు తప్ప మరేం చేయడం లేదని చంద్రబాబు దుయ్యబట్టారు.

  • 5 ఏళ్ల వయసున్న పసిపిల్లను పోలీసులతో భయపెట్టే నీచమైన స్థితికి జగన్ రెడ్డి దిగజారాడు. సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకే వస్తే, డ్రైవర్ పై దాడి చెయ్యడం ఎందుకు? కేసులు, విచారణల పేరుతో పోలీసులను రౌడీల్లా ప్రతిపక్ష నేతలపైకి జగన్ రెడ్డి ఉసిగొల్పుతున్నాడు.(2/4)

    — N Chandrababu Naidu (@ncbn) October 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ప్రతిపక్షానికి ప్రజాస్వామ్య పద్దతిలో సమాధానం చెప్పాలి. సిఐడి లాంటి విభాగాన్ని అడ్డుపెట్టుకుని వేధింపులతో పాలన సాగించడం సిగ్గుచేటు.(4/4)

    — N Chandrababu Naidu (@ncbn) October 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"చింతకాయల విజయ్ ఇంట్లోకి దొంగల్లా వెళ్లడాన్ని ఖండిస్తున్నా. ఇంటికెళ్లి పిల్లలు, పనివాళ్లను భయపెట్టడం దారుణం. నోటీసు ఇచ్చేందుకు వచ్చి డ్రైవర్‌పై ఎందుకు దాడి చేశారు?. కేసులు, విచారణ పేరుతో పోలీసులను రౌడీల్లా ఉసిగొల్పుతున్నారు. అయ్యన్న కుటుంబంపై ఆదినుంచి కక్షపూరితంగా ప్రభుత్వ వైఖరి. గతంలో నర్సీపట్నంలో అయ్యన్న ఇంటిపై ఇలాగే దాడి చేశారు. రోజుకో సీఐడీ కేసు, వారానికో అరెస్టు తప్ప మరేం చేయడం లేదు." -చంద్రబాబు

Nara Lokesh on CID police: కోర్టు ఎన్ని సార్లు చివాట్లు పెట్టినా జగన్ సర్కారుకు బుద్ధి రావడం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ విమర్శించారు. పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్ష సాధింపు సంస్థగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. బీసీ నేత అయన్నపాత్రుడు కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో ఉన్న ట్రెండ్​సెట్ అపార్ట్​మెంట్​​లో చింతకాయల విజయ్ ఇంటికి ఎలాంటి నోటీసులు లేకుండా వెళ్లిన ఏపీ పోలీసులు... అక్రమ అరెస్టుకు ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. ఎందుకు వచ్చారో చెప్పకుండా తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి చొరబడి, కుటుంబ సభ్యులు, ఇంట్లో పనిచేసేవారిపై బెదిరింపులకు పాల్పడ్డారని లోకేశ్​ ఆరోపించారు. నేరాలు-ఘోరాలు చేస్తున్న వైకాపా నేతలకు ప్రభుత్వం... సన్మానాలు చేసి పదవులు కట్ట బెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి... ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న తెదేపా నేతలపై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. అయన్నపాత్రుడు కుటుంబాన్ని టచ్ చేసిన ఏ ఒక్కరిని వదిలి పెట్టమన్న ఆయన వైకాపా అధికార మదాన్ని అణిచివేస్తామని హెచ్చరించారు.

  • హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న ట్రెండ్ సెట్ అపార్ట్మెంట్ లో చింతకాయల విజయ్ ఇంటికి ఎటువంటి నోటీసులు లేకుండా వెళ్లిన ఏపి పోలీసులు అక్రమ అరెస్ట్ కి ప్రయత్నించడం దారుణం. ఎందుకు వచ్చారో చెప్పకుండా తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి చొరబడి, కుటుంబ సభ్యులు..,(2/4)

    — Lokesh Nara (@naralokesh) October 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కోర్టు ఎన్నిసార్లు చెప్పినా జగన్ సర్కార్‌కు బుద్ధి రావట్లేదు. పోలీసు వ్యవస్థను రాజకీయ కక్ష సాధింపు సంస్థగా మార్చారు. అయ్యన్న కుటుంబాన్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. హైదరాబాద్‌లో విజయ్‌ అక్రమ అరెస్టుకు యత్నించడం దారుణం. ఎందుకొచ్చారో చెప్పకుండా తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్తారా?. ఇంట్లో పనిచేసేవారిపై బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా." -నారా లోకేశ్​

Achenna on CID police: జగన్ పెంపుడు చిలుకలా ఏపీ సీఐడీ వైఖరి ఉందని తెదేపా నేత అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. తప్పుడు కేసులు, బెదిరింపులు, దాడులే సీఐడీ విధుల్లా మారాయని విమర్శించారు. జగన్ ఆదేశాల మేరకే తెదేపా నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తెదేపా నేత చింతకాయల విజయ్‌పై కేసు దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టిన వారికి శిక్ష పడేవరకు కోర్టుల్లో పోరాటం చేస్తామన్నారు.

  • ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న టిడిపి నేతల పై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు జగన్ రెడ్డి. అయన్నపాత్రుడు గారి కుటుంబాన్ని టచ్ చేసిన ఏ ఒక్కరిని వదిలి పెట్టం. వైసిపి అధికార మదాన్ని అణిచివేస్తాం.(4/4)

    — Lokesh Nara (@naralokesh) October 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"జగన్ పెంపుడు చిలుకలా ఏపీ సీఐడీ వైఖరి ఉంది. తప్పుడు కేసులు, బెదిరింపులు, దాడులే సీఐడీ విధుల్లా మారాయి. జగన్ ఆదేశాల మేరకే తెదేపా నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తెదేపా నేత చింతకాయల విజయ్‌పై కేసు దుర్మార్గం. తప్పుడు కేసులు పెట్టిన వారికి శిక్ష పడేవరకు కోర్టుల్లో పోరాటం సాగిస్తాం." -తెదేపా నేత అచ్చెన్నాయుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.