ETV Bharat / city

న్యాయవాదుల హత్య కేసు సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టులో పిటిషన్

author img

By

Published : Feb 26, 2021, 6:06 PM IST

lawyer murder case latest news
న్యాయవాదుల హత్య కేసు సీబీఐకి బదిలీ

తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది. అక్రమాలు ప్రశ్నించినందుకే నా బిడ్డలను చంపారని.. సీబీఐతో విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని లాయర్​ వామన్​రావు తండ్రి గట్టు కిషన్​రావు పిటిషన్​లో పేర్కొన్నారు.

తెలంగాణలో జరిగిన న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది. లాయర్​ వామన్​రావు తండ్రి గట్టు కిషన్​రావు ఈ పిటిషన్​ దాఖలు చేశారు. పుట్టా మధు అక్రమాలు ప్రశ్నించినందుకే నా బిడ్డలను చంపారని కిషన్‌రావు పిటిషన్​లో ఆరోపించారు.

హత్యకేసు నిందితులను వారం రోజులపాటు పోలీస్​ కస్టడీకి ఇస్తూ.. ఇటీవలే మంథని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటూ డీసీపీ రవీందర్​ మంథని కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. అనుమతించిన కోర్టు కుంట శ్రీను, చిరంజీవి, కుమార్​ను వారంపాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చింది.

ఇదీ చూడండి: న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితులకు కస్టడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.