ETV Bharat / city

'మంత్రి బొత్సకు వినతిపత్రమిచ్చినా స్పందించలేదు'

author img

By

Published : Jun 12, 2021, 9:55 PM IST

municipal strike
municipal strike

ఈ నెల 14, 15 తేదీల్లో సమ్మెకు దిగుతున్నామని రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్, ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు ఉమామహేశ్వరరావు అన్నారు. కార్మికుల సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించామని.. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సమస్యల పరిష్కారానికి మంత్రి బొత్స సత్యనారాయణకు చాలాసార్లు వినతి పత్రమిచ్చామని.. స్పందన లేకపోవడంతో జూన్ 14, 15 తేదీల్లో రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగుతున్నామని రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్, ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు ఉమామహేశ్వరరావు అన్నారు. కార్మికుల సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆయన విజయవాడలో విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారితో పోరాటం చేస్తూ.. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తే ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మికులకు రక్షణ గ్లౌజులు, పీపీఈ కిట్లు, మెరుగైన వైద్యం, రూ.50 లక్షల బీమా సౌకర్యం, దీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న జీతాలు, హెల్త్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలన్నారు.

ఇదీ చదవండి: video: ఆకలి తీర్చిన అమ్మతనం.. పందిపిల్లలకు గోమాత పాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.