ETV Bharat / city

పాఠశాలల్లో నాడు-నేడు పనులను వెంటనే ప్రారంభించాలి: మంత్రి బొత్స

author img

By

Published : Jun 2, 2022, 10:50 PM IST

మన బడి, నాడు-నేడు రెండో దశ పనులను వెంటనే ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నిర్ణీత కాలపరిమితిలో ఈ పనులన్నీ పూర్తి అయ్యేలా జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు పూర్తి సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు.

పాఠశాలల్లో నాడు-నేడు పనులను వెంటనే ప్రారంభించాలి
పాఠశాలల్లో నాడు-నేడు పనులను వెంటనే ప్రారంభించాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మన బడి, నాడు-నేడు రెండో దశ పనులను వెంటనే ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నిర్ణీత కాలపరిమితిలో ఈ పనులన్నీ పూర్తి అయ్యేలా జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు పూర్తి సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్​తో కలిసి జిల్లా కలెక్టర్లు, జేసీలు, జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. నాడు-నేడు రెండో దశలో భాగంగా 12 వేల పైచిలుకు పాఠశాలల్లో పనులు చేపట్టనున్నామని తెలిపారు. వీటి కోసం నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. పనుల నిమిత్తం ఈ పాటికే రివాల్వింగ్ ఫండ్ కూడా విడుదలైనందున, పనులను ప్రారంభిచాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులకు అవసరమైన ఇసుక, సిమెంట్, వంటి వాటిని కూడా అందుబాటులో ఉంచామన్నారు. ఈ పనుల నాణ్యతలో ఏమాత్రం రాజీ పడవద్దని, పనులు వేగవంతంగా జరగడంలో అధికారులు, ఆయా పాఠశాలల పేరెంట్స్ కమిటీలు కూడా పూర్తి సమన్వయంతో పని చేయాలని మంత్రి పేర్కొన్నారు. పాఠశాలల్లో గతానికి ఇప్పటికీ స్పష్టమైన మార్పు కనిపించాలని అన్నారు. ఈ పనులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఎటువంటి సమస్యలు ఎదురైనా, వాటిని వెంటనే ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.