ETV Bharat / city

ఎంపీ రఘురామపై హైదరాబాద్​లో కేసు నమోదు

author img

By

Published : Jul 5, 2022, 5:35 PM IST

Updated : Jul 5, 2022, 10:22 PM IST

ఎంపీ రఘురామపై హైదరాబాద్‌లో కేసు నమోదు
ఎంపీ రఘురామపై హైదరాబాద్‌లో కేసు నమోదు

17:33 July 05

ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు

Case on MP RRR: నరసాపురం ఎంపీ రఘురామపై హైదరాబాద్​లో కేసు నమోదైంది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆయనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో రఘురామ కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను నిందితులుగా చేర్చారు. విధి నిర్వహణలో భాగంగా తాను బౌల్డర్‌హిల్స్‌ వద్ద ఉండగా నలుగురు వ్యక్తులు వచ్చి తనను కారులో ఎక్కించుకొని రఘురామ ఇంట్లోకి తీసుకెళ్లి, చిత్రహింసలకు గురి చేశారని ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఎస్‌కే ఫరూక్‌ బాషా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన వద్ద పర్సు, ఐడీ కార్డు లాగేసుకున్నారని పేర్కొన్నారు.

ప్రధాని భద్రతా విధుల్లో ఉండగా నాపై దాడి చేశారు. ఎంపీ రఘురామ ఇంట్లో నన్ను 3 గంటలు నిర్బంధించారు. రఘురామ సహా ఐదుగురు నాపై దాడి చేశారు. అందరూ చూస్తుండగానే నాపై దాడి చేశారు. నన్ను కారులో బలవంతంగా తీసుకెళ్లారు. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను అని చెప్పినా వినలేదు. నా ఐడీ కార్డు, పర్స్‌ లాక్కుని విడతలవారీగా హింసించారు. ఎంపీ, మరో ముగ్గురు లాఠీలతో కొట్టి దుర్భాషలాడారు. - ఫరూక్ బాషా, కానిస్టేబుల్

తెలంగాణ సీఎంకు రఘురామ లేఖ: హైదరాబాద్​లోని తన ఇంటి వద్ద రెక్కీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీ రఘురామ తెలంగాణ సీఎం కేసీఆర్​కు లేఖ రాశారు. నిన్న (సోమవారం) తన ఇంటి వద్ద ఆరుగురు రెక్కీ నిర్వహించారని రఘురామ తెలిపారు. తన భద్రత కోసం సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని కేటాయించారని..,వారు రెక్కీ చేసిన ఒకరిని పట్టుకున్నారన్నారు. రెక్కీ నిర్వహించిన మిగతా వ్యక్తులు కారులో పారిపోయారని తెలిపారు. రెక్కీలపై గతంలో గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశానని రఘురామ లేఖలో పేర్కొన్నారు.

ఇద్దరు సస్పెన్షన్​: ఏపీ కానిస్టేబుల్‌పై దాడి కేసులో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇద్దరు భద్రతా సిబ్బందిపై వేటు వేశారు. ఎంపీ రఘురామకు భద్రతా సిబ్బందిగా ఉన్న సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ గంగారామ్, కానిస్టేబుల్ సందీప్​ను సస్పెండ్​ చేశారు.

ఇవీ చదవండి

Last Updated :Jul 5, 2022, 10:22 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.