ETV Bharat / city

ఉక్రెయిన్​లో చిత్తూరు జిల్లా విద్యార్దుల వెతలు

author img

By

Published : Feb 25, 2022, 7:07 PM IST

sainikhitha
సాయినిఖిత

వైద్య విద్యను అభ్యసించేందుకు చిత్తూరు జిల్లా నుంచి ఉక్రెయిన్​ వెళ్లిన విద్యార్థులు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రష్యా-ఉక్రెయిన్​ యుద్ధం కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. ఇక్కడ వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.

వైద్య విద్య అభ్యసించేందుకు ఉక్రెయిన్ వెళ్లిన చిత్తూరు విద్యార్ధులు పలువురు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రష్యా దాడుల నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ ఆవేదన చేస్తున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్​లో ఉంటున్న చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన విద్యార్ధిని సాయినిఖిత తన తల్లిదండ్రులతో మాట్లాడారు.

ఉక్రెయిన్​లోని కుమార్తెతో ఫోన్​ మాట్లాడుతున్న తల్లిదండ్రులు

తాము ఉంటున్న పరిసర ప్రాంతాలలో బాంబు దాడులు జరుగుతున్నట్లు అమ్మాయి వివరించారు. భారతదేశానికి రావడానికి ప్రయత్నిస్తున్నా వీలు కావడం లేదన్నారు. తమను సురక్షితంగా తీసుకెళ్లాలని విద్యార్ధిని కోరారు. కుమార్తె ఉక్రెయిన్​లో ఇరుక్కపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర వేదనకు గురవుతున్నారు.

ఇదీ చదవండి: ఉక్రెయిన్​లో గుంటూరు జిల్లా విద్యార్థుల అవస్థలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.