ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 3PM

author img

By

Published : Nov 23, 2021, 2:59 PM IST

.

AP TOP NEWS @ 3PM
AP TOP NEWS @ 3PM

  • కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికపై హైకోర్టు ఆగ్రహం
    కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌, విజయవాడ పోలీస్ కమిషనర్​లను కోర్టుకు రావాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • CBN: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదాపై చంద్రబాబు ఆగ్రహం
    కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదాపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • AMARAVATI INCIDENTS: అమరావతి బిల్లు నుంచి 3 రాజధానుల ఉపసంహరణ వరకు.. అసలేంజరిగిందంటే ?
    రాష్ట్ర విభజింపబడిన నాడు అప్పటి సర్కారు అమరావతిని రాజధానిగా(Timeline of Amaravati from 2014-2021) ప్రకటించిన నాటి నుంచి నిన్న ప్రభుత్వం మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకోవడం వరకు జరిగిన పరిణామాల వివరాలు తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • FLOODS EFFECT: గుడిసెలన్నీ బురదమయం.. రోడ్లపైనే జన జీవనం..!
    ఉండేదేమో పూరి గుడిసెల్లో... దానికితోడు ఇటీవల కురిసిన వర్షాలతో గ్రామాలన్నీ జలమయమయ్యాయి. వరద కాస్త తగ్గినప్పటికీ... ఇళ్లన్నీ బురదమయమయ్యాయి. ఎక్కడుండాలో తెలీక చాలా మంది రోడ్లమీదే గడిపేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సెంట్రల్ విస్టా: ఉపరాష్ట్రపతి కొత్త నివాసానికి లైన్ క్లియర్
    కేంద్రం ప్రతిప్టాత్మకంగా చేపడుతున్న సెంట్రల్​ విస్టా (Central vista) ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఉపరాష్ట్రపతి కొత్త అధికారిక నివాస ప్రాంతాన్ని ఎందుకు మార్చారని దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐఏఎఫ్ చీఫ్​కు 'పరమ్ విశిష్ట్​ సేవా' పురస్కారం- సంతోష్​ బాబుకు 'మహావీర్ చక్ర'
    ​భారత వైమానిక దళ(ఐఏఎఫ్​) చీఫ్​ ఎయిర్ చీఫ్ మార్షల్​ వీఆర్​ చౌదరి, నేవీ చీఫ్​ డెసిగ్నేట్​ వైస్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్​కు కేంద్రం.. 'పరమ్ విశిష్ట్​ సేవా' పురస్కారాన్ని ప్రదానం చేసింది. కర్నల్ సంతోష్ బాబును 'మహావీర్​ చక్ర' పురస్కారంతో సత్కరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఎయిర్​టెల్​ బాటలోనే వొడాఫోన్​ ఐడియా.. ఛార్జీలు భారీగా పెంపు
    అప్పుల ఊబిలో కూరుకుపోయిన (Telecom news) టెలికాం ఆపరేటర్​ వొడాఫోన్​ ఐడియా (Vodafone idea) కూడా ఎయిర్​టెల్​ బాటలోనే పయనించింది. టారిఫ్​లను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • IND vs NZ Test Series: 'హనుమ విహారి చేసిన తప్పేంటి?'
    న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​కు హనుమ విహారిని(Hanuma Vihari News) ఎంపిక చేయకపోవడంపై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా విమర్శలు చేశాడు. ఇండియా- ఏ తరఫున అతడిని దక్షిణాఫ్రికాకు పంపడమేంటని అన్నాడు. విహారి చేసిన తప్పేంటని ప్రశ్నించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఆ దిగ్గజ ఫుట్​బాలర్ నన్ను రేప్ చేశాడు'
    ఫుట్​బాల్ దిగ్గజం డీగో మారడోనాపై(Diego Maradona News) సంచలన ఆరోపణలు చేశారు క్యూబాకు చెందిన ఓ మహిళ. టీనేజ్​లో ఉన్నప్పుడే ఆమెపై డీగో అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Jai Bhim: హీరో సూర్యపై పరువు నష్టం కేసు
    తమిళ నటుడు సూర్యపై (case on suriya) వన్నియార్ సంఘం.. కోర్టులో పరువు నష్టం కేసు నమోదు చేసింది. 'జై భీమ్' సినిమాలో (Jai bhim movie ) ఉద్దేశపూర్వకంగా తమ వర్గాన్ని కించపరిచేలా చూపించారని తన ఫిర్యాదులో పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.