TOP NEWS: ప్రధాన వార్తలు @ 7AM

author img

By

Published : Aug 3, 2022, 7:01 AM IST

TOP NEWS

TOP NEWS: ప్రధాన వార్తలు @ 7AM

  • పింగళి వెంకయ్యకు అమిత్​ షా ఘన నివాళి.. స్మారక తపాలా బిళ్ల విడుదల
    భారతీయుల ఆకాంక్షలను మూడు రంగుల్లో నిక్షిప్తం చేశారని జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యను కేంద్రమంత్రి కొనియాడారు. జాతీయ పతాక రూపకర్తకు కేంద్రహోంమంత్రి అమిత్‌షా ఘనంగా నివాళులర్పించారు. ఆయన స్మారకంగా తపాలా బిళ్ల విడుదల చేసిన కేంద్రమంత్రి వారి కుటుంబ సభ్యులకు సన్మానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • AP Debits: తప్పుల అప్పులు.. బ్యాంకులు నిబంధనలను ఉల్లంఘించాయన్న ఆర్‌బీఐ
    AP Debits: రాష్ట్రం చేసిన అప్పుల తీరు తప్పని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ వేదికగా తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్​కు రూ.25 వేల కోట్ల రుణం ఇవ్వడంలో బ్యాంకులు నిబంధనలు పాటించలేదని రిజర్వుబ్యాంకు పేర్కొన్నట్లు కూడా స్పష్టం చేసింది. ఎంపీ విజయసాయి అడిగిన ప్రశ్నలకు రాజ్యసభలో కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'సీడ్స్‌' లో మళ్లీ విషవాయువు కలకలం.. 150 మంది మహిళలకు తీవ్ర అస్వస్థత
    Gas leak in Seeds: 'సీడ్స్‌' లో మళ్లీ విషవాయువు కలకలం రేగింది. సీడ్స్‌ దుస్తుల కంపెనీలో సుమారు 150 మంది మహిళా కార్మికులకు తీవ్ర అస్వస్థతkు గురయ్యారు. వారందరినీ అచ్యుతాపురం, అనకాపల్లిలోని ఆసుపత్రులకు తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కాకినాడలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు
    ACCIDENT: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామచంద్రాపురంలో శుభకార్యానికి వెళ్తుండగా తుని మండలంలోని వెలమకొత్తూరు వద్ద ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భూగర్భ జలాలు విషపూరితం.. కేంద్రం షాకింగ్ కామెంట్స్​..!
    Ground water: భూగర్భజలాల కాలుష్యం గురించి పార్లమెంట్‌లో కేంద్రం చెప్పిన విషయాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. ఈ జలాల నాణ్యత క్షీణిస్తోందని రాజ్యసభలో కేంద్రం అంగీకరించింది. గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం మనం తాగుతున్న నీరు విషపూరితమని, దాదాపు అన్ని రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో భూగర్భ జలాల్లో విషపూరిత లోహాలున్నాయని వెల్లడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇంటిపై కూలిన కొండచరియలు.. ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
    Bhatkal landslide: కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. సహాయక చర్యలు చేపట్టిన ఎన్​డీఆర్​ఎఫ్​​ అధికారులు నాలుగు మృతదేహాలను వెలికితీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చైనా హెచ్చరించినా తైవాన్​లో అడుగుపెట్టిన పెలోసీ.. క్షణక్షణం ఉత్కంఠ
    Pelosi Visit Taiwan: అమెరికా ప్రతినిధుల సభ(హౌస్​ ఆఫ్​ రిప్రసెంటేటివ్స్​) స్పీకర్ నాన్సీ పెలోసీ ఆసియా పర్యటన.. చైనా, అగ్రరాజ్యం మధ్య అగ్గిరాజేసింది. చైనా హెచ్చరించినా.. తైవాన్​ రాజధాని తైపీలో అడుగుపెట్టారు పెలోసీ. ఆమె తైవాన్​కు వస్తే అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చైనా హెచ్చరించినా.. ఆమె వెనక్కి తగ్గలేదు. పెలోసీ పర్యటన నేపథ్యంలో తైవాన్ స్ట్రైట్‌లో చైనా సైనిక విన్యాసాలు చేస్తోంది. అమెరికా సైతం తమ ఆసియా-పసిఫిక్ కమాండ్‌ను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో పెలోసీ.. తైవాన్‌ పర్యటన క్షణక్షణం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'రూపాయి పతనమేమీ కాలేదు.. ఆ నగదు విత్​డ్రాకు నో జీఎస్టీ': నిర్మల
    Nirmala sitharaman on rupee fall: రూపాయి విలువలో ఎలాంటి పతనం లేదని పేర్కొన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. ఆర్‌బీఐ నిరంతరం రూపాయి కదలికలపై దృష్టి సారిస్తోందని తెలిపారు. సహజరీతిలోనే అది ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • India Vs West Indies: మిస్టర్ 360 సూపర్ షో.. భారత్ గ్రాండ్ విక్టరీ
    India Vs West Indies: విండీస్​తో మూడో టీ20 మ్యాచ్​లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. సూర్యకుమార్ సూపర్ బ్యాటింగ్​తో 76 పరుగులు చేయగా 165 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఐదు మ్యాచ్​లో సిరీస్​లో భారత్ 3-2తో ముందంజ వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'పాన్​ ఇండియా కొత్తేమి కాదు.. ఎప్పటి నుంచో నేను..'
    Seetaramam Dulquer Salman: ప్రతి సినిమాకు నటనలో వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్​. ఆగస్టు 5న 'సీతారామం.. యుద్ధం రాసిన ప్రేమ కథ' అంటూ మన ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని చిత్ర విశేషాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.