India Vs West Indies: మిస్టర్ 360 సూపర్ షో.. భారత్ గ్రాండ్ విక్టరీ

author img

By

Published : Aug 3, 2022, 1:09 AM IST

Updated : Aug 3, 2022, 1:14 AM IST

India Vs West Indies 3rd t20

India Vs West Indies: విండీస్​తో మూడో టీ20 మ్యాచ్​లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. సూర్యకుమార్ సూపర్ బ్యాటింగ్​తో 76 పరుగులు చేయగా 165 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఐదు మ్యాచ్​లో సిరీస్​లో భారత్ 3-2తో ముందంజ వేసింది.

India Vs West Indies: మూడో టీ20లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో విండీస్​ను చిత్తు చేసింది. బస్సెటెర్రె వేదికగా వెస్టిండీస్​తో జరిగిన మూడో టీ20 మ్యాచ్​లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్​లో అదరగొట్టాడు. కేవలం 44 బంతుల్లోనే 76 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. విండీస్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన రోహిత్‌సేన మరో 6 బంతులు మిగిలుండగానే విజయదుందుభి మోగించింది.

India Vs West Indies 3rd t20
India Vs West Indies 3rd t20

ఓపెనర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (72; 8×4, 4×6) చెలరేగడంతో టీమిండియా సునాయాసంగా గెలిచేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (11; 1×6,1×4) బ్యాటు ఝులిపించినప్పటికీ 1.4 ఓవర్‌ వద్ద రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ (24; 27 బంతుల్లో 2×4)తో కలిసి సూర్యకుమార్‌ యాదవ్‌ ఇన్నింగ్స్‌ నిర్మించాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఇద్దరూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. కానీ, అకియల్‌ హోసీన్‌ వేసిన 11.3వ బంతికి శ్రేయస్‌ స్టంపౌటయ్యాడు. జట్టు స్కోరు 135 వద్ద డ్రేక్స్‌ వేసిన 14.3వ బంతికి సూర్యకుమార్‌ యాదవ్‌ భారీ షాట్‌ ఆడబోయి అల్‌జారీ జోసెఫ్‌ చేతికి చిక్కాడు. దీంతో స్కోరు వేగం కాస్త మందగించింది. హార్దిక్‌ పాండ్య (4) నిరాశపరిచినా.. రిషబ్‌ పంత్‌ (33 నాటౌట్‌; 24 బంతుల్లో 2×4, 1×6), దీపక్‌ హుడా (10 నాటౌట్‌; 7 బంతుల్లో 1×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో విజయం భారత్‌ వశమైంది.

అంతకుముందు టాస్‌ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.ఓపెనర్‌ మేయర్స్‌ (73; 53 బంతుల్లో 8×4,4×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.బ్రాండన్‌ కింగ్‌ (20; 20 బంతుల్లో 3x4), నికోలస్‌ పూరన్‌ (22; 23 బంతుల్లో 2x4, 1x6) ఫర్వాలేదనిపించారు. భారత్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ 2 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్‌ పాండ్య, అర్షదీప్‌ సింగ్‌ చెరోవికెట్‌ తీశారు. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటి వరకు భారత్‌ రెండు విజయాలు నమోదు చేయగా.. వెస్టిండీస్‌ ఒక మ్యాచ్‌లో గెలుపొందింది.

ఇవీ చదవండి: కామన్​వెల్త్​లో ఘనమైన చరిత్ర.. భారత్ సుదీర్ఘ ప్రయాణం ఇలా...

Last Updated :Aug 3, 2022, 1:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.