ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 7PM

author img

By

Published : Jul 18, 2022, 6:59 PM IST

TOP NEWS
ప్రధాన వార్తలు

.

  • సాయం అందించాల్సిన నిధులు మళ్లించడమేంటి?: చంద్రబాబు
    CBN fires on YSRCP: కొవిడ్ బాధితులకు సాయంగా అందాల్సిన నిధులను దారి మళ్లించడమేంటని తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. దారి మళ్లించిన నిధులను వెంటనే ఎస్డీఆర్​ఎఫ్​ ఖాతాలో జమ చెయ్యాలని.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ రెడ్డి పాలనకు చెంపపెట్టు అని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఒక్క ప్రాణం పోకుండా సహాయక చర్యలు చేపట్టాం: మంత్రి అంబటి రాంబాబు
    Ambati Rambabu: భారీగా వరదలు వచ్చినా.. ఒక్క ప్రాణం కూడా పోకుండా గోదావరి వరదల్లో అధికారులు, సిబ్బంది.. అద్భుతంగా సహాయక కార్యక్రమాలు చేపట్టారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బాధితులకు పునరావాసాలు కల్పించే విషయంలో.. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • కంటైనర్‌ కిందకు దూసుకెళ్లిన ఆటో.. అక్కడికక్కడే ఆరుగురు మృతి
    తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. అయితే ఈ ప్రమాదానికి ఆటో రాంగ్​ రూట్​లో రావడమే కారణమని స్థానికులుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • అమరావతి రైతులను కలిసిన చంద్రబాబు.. రాజధాని ఎక్కడికి వెళ్లదని భరోసా
    CBN MEET: రాజధాని కోసం మందడం శిబిరం వద్ద దీక్ష చేస్తున్న అమరావతి రైతులను.. తెదేపా అధినేత చంద్రబాబు కలిశారు. రాజధాని ఎక్కడికీ వెళ్లదని.. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • నీట్ పరీక్షలో విద్యార్థినులకు ఇబ్బందులు.. లోదుస్తులు తీసేస్తేనే ఎంట్రీ!
    NEET exam underwear: లోదుస్తులు తీసేస్తేనే నీట్ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతిస్తామని బలవంతం చేసినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిబ్బంది నిర్వాకం వల్ల పరీక్ష సరిగా రాయలేకపోయినట్లు పేర్కొంది. ఈ ఆరోపణలపై కళాశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • మళ్లీ తెరపైకి బాబ్రీ కేసు.. తీర్పుపై రివ్యూ పిటిషన్.. కోర్టు కీలక వ్యాఖ్యలు
    Babri masjid demolition: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్​ను క్రిమినల్ వ్యాజ్యంగా పరిగణించనున్నట్లు అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఆగస్టు 1న వాదనలు వినడం ప్రారంభించనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'నా మామ, భార్య జోలికొస్తే..'.. వారికి రిషి స్ట్రాంగ్ కౌంటర్!
    Rishi Sunak: బ్రిటన్​ ప్రధాని పదవి రేసులో దూసుకుపోతున్న భారత మూలాలున్న రిషి సునాక్​.. తన అత్తమామలైన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, సుధా మూర్తి సాధించిన ఘనత పట్ల తాను ఎంతో గర్విస్తున్నానని స్పష్టం చేశారు. తన మామ, భార్యపై వచ్చే తప్పుడు వార్తలను తిప్పికొట్టారు. 20 కోట్ల రూపాయల పన్ను తప్పించుకునే వీలున్నా.. తన భార్య స్పచ్ఛందంగా వదులుకున్నారని సునాక్‌ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఐటీ రిటర్న్స్​ దాఖలు చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
    ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు చివరి తేదీ జులై 31. గడువు తేదీ సమీపిస్తున్నందున వీలైనంత తొందరగా ఈ ప్రక్రియ పూర్తి చేయడం మేలు. ఐటీఆర్‌ను పూర్తి చేసేటప్పుడు అసెసీలు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇవి దొర్లకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఇంగ్లాండ్​ స్టార్​ ఆల్​రౌండర్ సంచలన నిర్ణయం..​ వన్డే క్రికెట్​కు గుడ్​బై
    Benstokes retirement: బెన్​స్టోక్స్​.. క్రికెట్​ గురించి తెలిసిన ప్రతిఒక్కరికీ ఈ పేరు తెలిసే ఉంటుంది. ఇంగ్లాండ్​ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ స్టార్​ ఆల్​రౌండర్​ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • చిక్కుల్లో మణిరత్నం, విక్రమ్​.. నోటీసులు పంపిన కోర్టు!
    ప్రముఖ దర్శకుడు మణిరత్నం, హీరో విక్రమ్​పై ఓ న్యాయవాది పలు ఆరోపణలు చేశారు. కోర్టును ఆశ్రయించి.. వారికి నోటిసులు పంపారు. ఇంతకీ ఏం జరిగిందంటే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.