ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM

author img

By

Published : Aug 25, 2021, 7:01 PM IST

ప్రధాన వార్తలు @ 7PM
ప్రధాన వార్తలు @ 7PM

.

  • రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు..

రాష్ట్రంలో కొత్తగా 1601 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 58 వేల 890 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • సీఎస్‌లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

ప్రధాని నరేంద్రమోదీ(PM MODI) దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వివిధ ప్రగతి అంశాలపై వారితో చర్చించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • బొబ్బిలిలో 10 మంది విద్యార్థులకు కరోనా

విజయనగరం జిల్లాలోని బొబ్బిలిలో 10 విద్యార్థులకు కరోనా సోకింది. మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు కొవిడ్ బారిన పడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మంత్రాలయంలో వైభవంగా రథోత్సవం

మంత్రాలయం(mantralayam)లో రాఘవేంద్రస్వామి 350వ ఆరాధనోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రాముడి అలంకరణలో ఉన్న ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను, మహారథంలో కొలువుదీరిన స్వామిని.. మంత్రాలయం పురవీధుల్లో ఊరేగించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కొండ ప్రాంతంలో కాలేజీ యువతిపై గ్యాంగ్​ రేప్

బాయ్​ఫ్రెండ్​తో కలిసి కొండ ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ కాలేజీ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు పలువురు దుండగులు. యువకుడిని చితకబాదారు. ప్రస్తుతం బాధితులిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • భారత్​లో కరోనా టీకా వల్ల సైడ్​ ఎఫెక్ట్స్​ తక్కువే!

కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న ఎక్కువ మంది భారతీయులకు సైడ్​ ఎఫెక్ట్స్​( Vaccine Side Effects)​ రాలేదని ఓ సర్వేలో తేలింది. కొంతమంది మాత్రం స్వల్ప దుష్ప్రభావాల బారిన పడినట్లు వెల్లడైంది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు తీసుకున్న వారిపై ఈ పరిశోధన జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'అవన్నీ అక్రమ కేసులు.. నేను తప్పుచేయలేదు'

తనపై శివసేన కార్యకర్తలు చేసిన ఫిర్యాదులు బాంబే హైకోర్టులో వీగిపోయినట్లు కేంద్ర మంత్రి నారాయణ్​ రాణె తెలిపారు. తాను ఎటువంటి నేరం చేయకపోవడం వల్లే తీర్పు తనకు అనుకూలంగా వచ్చినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'తాలిబన్లు చంపేసినా ఆ విషయంలో వెనక్కి తగ్గం'

తాలిబన్లు ఆక్రమించుకున్న అఫ్గానిస్థాన్​లో(taliban afghanistan news) ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. తాలిబన్ల పాలనపై తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఈ సమయంలో అక్కడి ఉపాధ్యాయులు ఓ అంశంపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే తమ ప్రాణాలు ధారపోస్తామని అంటున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అండర్సన్​ ఆన్ ఫైర్.. కుప్పకూలిన భారత టాపార్డర్

ఇంగ్లాండ్​తో జరుగుతున్న మూడో టెస్టులో భారత టాపార్డర్​ చేతులెత్తేసింది. అండర్సన్​ దాటికి తక్కువ వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది టీమ్ఇండియా. కోహ్లీ, పుజారా, రాహుల్ విఫలమయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'మా' ఎన్నికలకు ముహూర్తం ఖరారు

తెలుగు సినీ పరిశ్రమ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(MAA Elections) ఎన్నికల తేదీ ఖరారైంది. అక్టోబరు 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు 'మా' క్రమశిక్షణ సంఘం తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.