ETV Bharat / city

Sarpanches: కేంద్రం నిధులిస్తుంటే.. రాష్ట్రం దారి మళ్లీస్తోంది: సర్పంచ్​లు

author img

By

Published : Oct 7, 2022, 7:52 AM IST

Sarpanches Agitation in Guntur: నిధులు రాక..అభివృద్ధి పనులు చేయలేక అవమానాలు ఎదుర్కొంటున్న సర్పంచ్‌లు ప్రభుత్వంపై ఉద్యమ బావుటా ఎగురవేశారు. కేంద్రం ఇచ్చిన 15వ అర్థిక సంఘం నిధుల్ని తక్షణం విడుదల చేయాలంటూ నేడు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేయనున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు సైతం రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌లుగా గెలిచి ఏడాదిన్నర దాటినా ఓట్లు వేసిన ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నామన్నారు.

Sarpanches Agitation in Guntur
సర్పంచ్​ల సంఘం

ప్రభుత్వంపై ఉద్యమ బావుటా ఎగురవేసిన సర్పంచ్‌లు

Sarpanches in AP: నిధులు రాక..అభివృద్ధి పనులు చేయలేక అవమానాలు ఎదుర్కొంటున్న సర్పంచ్‌లు ప్రభుత్వంపై ఉద్యమ బావుటా ఎగురవేశారు. కేంద్రం ఇచ్చిన 15వ అర్థిక సంఘం నిదుల్ని తక్షణం విడుదల చేయాలంటూ నేడు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేయనున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు సైతం రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌లుగా గెలిచి ఏడాదిన్నర దాటినా ఓట్లు వేసిన ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నామన్నారు.

ప్రభుత్వంపై సర్పంచ్‌ల తిరుగుబాటు: ఇటీవలే కేంద్రం 948 కోట్ల రూపాయలు 15వ ఆర్థికసంఘం నిధులు విడుదల చేసింది. ఈ నిధులు ఆయా పంచాయతీల ఖాతాల్లో పడీపడగానే.. రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుంది. 14 వ ఆర్థికసంఘం నిధులు సైతం విద్యుత్ బకాయిల పేరిట గతేడాది ఇలాగే మళ్లించింది. దీనిపై సర్పంచ్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించి ఏడాదిన్నర గడుస్తున్నా.. ఇప్పటికీ గ్రామాల్లో ఒక్క రూపాయి పనులు కూడా చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒట్లేసి గెలిపించిన వారికి ముఖం చూపించలేకపోతున్నామంటున్నారు. రాష్ట్రంలో 13వేల 300 మంది సర్పంచ్‌లు ఉండగా.. వీరిలో మెజార్టీ వర్గం అధికార పార్టీకి చెందిన మద్దతుదారులే ఉన్నారు. వీరందరిదీ అదే పరిస్థితి.


పారిశుధ్య కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వలేని దుస్థితి: ఆర్థికసంఘం నిధులు విడుదలై నెలరోజులు దాటినా ఇప్పటికీ పంచాయతీల ఖాతాల్లోకి జమకాలేదు. కొన్నిచోట్ల సర్పంచ్‌లు సొంత నిధులు వెచ్చించి గ్రామాల్లో పనులు చేయించారు. ఆర్థికసంఘం నిధులు వస్తాయని మరికొందరు అప్పులు చేసి మరీ అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పుడు ఆర్థిక సంఘం నిధులు దారిమళ్లించడంతో వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పారిశుధ్య కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని వాపోతున్నారు.

నిధులు ఇవ్వనప్పుడు పంచాయతీలు ఎందుకని ప్రశ్నిస్తున్న సర్పంచులు: పంచాయతీలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటున్న సర్పంచులు.. కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధుల కోసమే ఎన్నికలు నిర్వహించిందని ఆరోపిస్తున్నారు. నిధులు ఇవ్వనప్పుడు పంచాయతీలు ఎందుకని ప్రశ్నిస్తున్న వారు. వ్యవస్థనే రద్దుచేయాలని ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. పంచాయతీరాజ్‌ కార్యాలయం వద్ద నిరసనతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆర్థికసంఘం నిధులు రాబట్టాలని సర్పంచ్‌లు యోచిస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.