ETV Bharat / city

BHARAT BANDH: భారత్‌ బంద్‌కు అనుమతి లేదు.. కేసు నమోదైతే ఉద్యోగాలు రావు- పోలీసులు

author img

By

Published : Jun 20, 2022, 8:46 AM IST

AP POLICE
AP POLICE

BHARAT BANDH: ‘అగ్నిపథ్‌’ పథకాన్ని నిరసిస్తూ పలు సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు తలపెట్టిన భారత్‌ బంద్‌కు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. నిబంధనలు అతిక్రమించి పాల్గొన్న వారిపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

BHARAT BANDH: ‘అగ్నిపథ్‌’ పథకాన్ని నిరసిస్తూ పలు సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు తలపెట్టిన భారత్‌ బంద్‌కు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. నిబంధనలు అతిక్రమించి పాల్గొన్న వారిపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు, యువకులపై కేసులు నమోదైతే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు వారు అనర్హులవుతారని పేర్కొన్నారు. కేసుల్లో ఉన్న వారికి పాస్‌పోర్టులు కూడా రావని హెచ్చరించారు. అందుకే అగ్నిపథ్‌ నిరసన కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొనవద్దని పిలుపునిచ్చారు. అసాంఘిక శక్తులు అల్లర్లు, విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీకి నిరసనలకు అనుమతి ఇవ్వడం లేదని వెల్లడించారు. ఈ మేరకు విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటా, ఏలూరు ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ సహా వివిధ జిల్లాల ఎస్పీలు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. భారత్‌ బంద్‌ పిలుపు నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కీలక ప్రాంతాల్లో పోలీసులు భద్రత పెంచారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొంతమంది యువతను అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.