ETV Bharat / city

INTER EXAMS: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం!

author img

By

Published : Jul 14, 2021, 4:49 PM IST

inter first year exams in August
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు

ప్రభుత్వం అనుమతి ఇస్తే ఆగస్టు మొదటి వారంలో పరీక్షలను(Inter‌ first year exams) ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఇంటర్‌బోర్డు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించినట్లు తెలుస్తోంది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఆగస్టులో ఇంటర్‌ తొలి ఏడాది పరీక్షలు ఉండే అవకాశం ఉంది.

పరీక్షలు లేకుండా ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలోకి ప్రమోట్‌ అయిన విద్యార్థులకు మొదటి ఏడాది పరీక్షలను(Inter‌ first year exams) ఆగస్టులో నిర్వహించాలని తెలంగాణ ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిసింది. కరోనా కారణంగా మే నెలలో జరగాల్సిన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించలేదు. ఇంటర్‌ ద్వితీయ విద్యార్థులకు తొలి ఏడాదిలో వచ్చిన మార్కులనే కేటాయించి ఇటీవల ఫలితాలు కూడా వెల్లడించారు. ప్రథమ ఏడాది విద్యార్థులను మాత్రం రెండో ఏడాదిలోకి ప్రమోట్‌ చేశారు.

ఎప్పుడైనా కరోనా మూడో వేవ్‌

భవిష్యత్తులో సాధ్యమైతే పరీక్షలు జరుపుతామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం అనుమతి ఇస్తే ఆగస్టు మొదటి వారంలో పరీక్షలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇంటర్‌బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించినట్లు సమాచారం. సెప్టెంబరు, ఆ తర్వాత ఎప్పుడైనా కరోనా మూడో వేవ్‌ వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నందున పరీక్షలు జరపడానికి ఆగస్టు నెల అన్ని విధాలా సురక్షితమని బోర్డు భావిస్తోంది. మే నెలలో జరిగే పరీక్షల కోసం ఫీజులు చెల్లించిన వారు 4,59,008 మంది ఉన్నారు. ఇంటర్‌బోర్డు ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరిస్తుందా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.

ఇదీ చదవండి:

AP-TG WATER ISSUE: కృష్ణా జలాలపై... మరోసారి సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.