ETV Bharat / city

Sadhana Deeksha: సాధన దీక్షలో పాల్గొన్న చంద్రబాబు..

author img

By

Published : Jun 29, 2021, 10:54 AM IST

Sadhana Deeksha
సాధన దీక్షలో

అమరావతిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో చంద్రబాబు నిరసన దీక్షకు దిగారు. మొదటగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన చంద్రబాబు.. పార్టీ నాయకులతో కలిసి దీక్షలో కూర్చున్నారు. కొవిడ్ బాధితులను ఆదుకోవాలనే డిమాండ్‌తో నేడు రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా సాధన దీక్ష చేపడుతోంది.

కొవిడ్ బాధితుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సాధన దీక్షకు నిరసనకు దిగారు. మొదటగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు దీక్షలో కూర్చున్నారు. 12 డిమాండ్ల పరిష్కారాన్ని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తెదేపా శ్రేణులు దీక్ష చేయనున్నారు.

ప్రతి తెల్ల రేషన్‌ కార్డు కుటుంబానికి తక్షణ సాయంగా 10 వేలు ఆర్థిక సాయం, కరోనా తీవ్రత కొనసాగినంతకాలం నెలకు 7,500 అందించాలని తెలుగుదేశం డిమాండ్‌ చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు ఆర్థిక సాయం అందించాలని, ఆక్సిజన్‌ మరణాలన్నిటికి ప్రభుత్వానిదే బాధ్యత కాబట్టి వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేసింది. రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. విధి నిర్వహణలో చనిపోయిన కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకు 50 లక్షలు అందించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులను కరోనా వారియర్లుగా​ గుర్తించి వారికి బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, ప్రజలందరికీ వ్యాక్సిన్ లను ఉచితంగా అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు.

చంద్రబాబుతో పాటు దీక్షలో అచ్చెన్నాయుడు, రామానాయుడు, యనమల, సోమిరెడ్డి, చినరాజప్ప, ఫరూక్, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, అనగాని, బోండా, అనిత, బీదా రవిచంద్ర, మంతెన సత్యనారాయణ రాజు, టీడీ జనార్దన్, గుమ్మడి సంధ్యారాణి, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

POWER WAR: ఇరురాష్ట్రాల మధ్య విద్యుత్​ పంచాయితీగా మారిన జల వివాదం

RRR letter: 'నవ సూచనల' పేరుతో సీఎం జగన్​కు రఘురామరాజు లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.