ETV Bharat / city

మునుగోడు ఫైట్ లో క్షుద్రపూజలు .. భాజపా బండి వర్సస్ తెరాస కేటీఆర్

author img

By

Published : Oct 8, 2022, 5:58 PM IST

Updated : Oct 8, 2022, 9:24 PM IST

Bandi Sanjay
బండి సంజయ్​

Munugode fight: తెరాసను భారాస చేయడం వెనుక కుట్ర ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఓ స్వామీజీ సూచనతోనే తాంత్రిక పూజలు చేసి,కేసీఆర్ పార్టీ పేరు మార్చారని వ్యాఖ్యానించారు. మునుగోడులో గెలుపు కోసం తెరాస కేసీఆర్ క్షుద్రపూజలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖలపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. సంజయ్‌ను ఇలాగే వదిలెయ్యకండి భాజపా బాబులు అంటూ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Bandi Sanjay Fires on CM KCR: ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం కేసీఆర్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. మునుగోడులో రాజగోపాల్‌ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా రాజగోపాల్‌ రెడ్డిని పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రకటించడం పట్ల రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్​లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తెరాసను భారాస చేయడం వెనుక కుట్ర ఉందని ఓ స్వామీజీ చెప్పినట్లు వెల్లడించారు. కేసీఆర్ చాలా రోజుల నుంచి తాంత్రిక పూజలు చేస్తున్నారని స్వామీజీ అన్నారని తెలిపారు. తాంత్రిక పూజలు చేసి తాంత్రికుడి సూచనతో కేసీఆర్ పార్టీ మార్చారని వ్యాఖ్యానించారు.

మూడు నెలలకొకసారి నల్లపిల్లితో కేసీఆర్ పూజలు.. ఫామ్‌హౌజ్‌లో క్షుద్రపూజలు చేసి ద్రవాలు కాళేశ్వరంలో కలిపారని.. మూడు నెలలకొకసారి నల్లపిల్లితో కేసీఆర్ పూజలు చేస్తారని సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. స్వప్రయోజనాల కోసం కేసీఆర్‌ క్షుద్రపూజలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కేసీఆర్ తన ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. మలక్‌పేట నియోజకవర్గానికి చెందిన తెరాస నేత లింగాల హరిగౌడ్‌ తన అనుచరులతో కలిసి భాజపాలో చేరారు. వీరికి సంజయ్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

మునుగోడులో తెరాస గెలవాలని క్షుద్రపూజలు.. లిక్కర్‌స్కాంపై వచ్చిన ఆరోపణలపై కేసీఆర్ ఎందుకు నోరుమెదపటం లేదన్న బండి... ఇష్టానుసారంగా దోచుకుంటే ఈడీ చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. దేశంలో సచివాలయానికి వెళ్లని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌... తాంత్రికుడి మాటలు విని కొత్త సచివాలయ భవనం నిర్మిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఫౌంహౌజ్‌లో కేసీఆర్‌.. నల్ల పిల్లితో తాంత్రిక పూజలు చేయిస్తారన్నారు. మునుగోడులో తెరాస గెలవాలని క్షుద్రపూజలు చేయిస్తున్నారు.. కేసీఆర్‌ ఆలోచనలు మార్చుకుని పాలన కొనసాగించాలని బండి సంజయ్ సూచించారు.

'ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్‌దిగజారుడు రాజకీయాలు. తెరాసను భారాస చేయటం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఎన్ని పూజలు చేసినా, కుట్రలు చేసినా మునుగోడులో తెరాస గెలువదు. లిక్కర్‌స్కాం ఆరోపణలపై కేసీఆర్‌ఎందుకు నోరు మెదపటంలేదు. ఇష్టానుసారంగా దోచుకుంటే ఈడీ చూస్తు ఊరుకుంటుందా. తెరాస, మజ్లీస్ కలిసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మజ్లీస్ పార్టీ చట్టాలను గౌరవించడం లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారు.'- బండి సంజయ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

కేటీఆర్ ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి.. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన మోహన్ భగవత్‌పై కేటీఆర్ చిల్లర వ్యాఖ్యలు చేశారని రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మజ్లీస్ వైపు చూసే సాహసం.. కేసీఆర్‌ కూడా చేయలేరని అన్నారు. రాష్ట్రంలో మజ్లీస్ నేతల ఆగడాలు ఎక్కువయ్యాయని లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

KTR React on Bandi Sanjay Comments తనదైన శైలిలో బండి సంజయ్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన కేటీఆర్

కేసీఆర్‌ క్షుద్రపూజలు చేస్తారంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. సంజయ్‌ను ఇలాగే వదిలెయ్యకండి భాజపా బాబులు అంటూ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మతి లేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడని పేర్కొన్నారు. పిచ్చి ముదిరి తొందరలో కరవడం కూడా మొదలు పెడతారేమో.. ఎర్రగడ్డలో ఆయన కోసం బెడ్‌ తయారుగా ఉందని ఎద్దేవా చేశారు. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి అని భాజపా నేతలకు కేటీఆర్‌ సూచించారు.

ఇవీ చదవండి:

ప్రేమించలేదని ప్రాణం తీశాడు... అసలేం జరిగిందంటే..?

టాపర్లకు హెలికాప్టర్ రైడ్.. హామీ నిలబెట్టుకున్న సీఎం.. విద్యార్థులు ఖుష్

'ఆదిపురుష్​' టీమ్​కు షాక్.. రిలీజ్​పై స్టే విధించాలని పిటిషన్ దాఖలు

Last Updated :Oct 8, 2022, 9:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.