ETV Bharat / city

నాజల్ డ్రాప్​ వ్యాక్సిన్​పై కృషి చేస్తున్నాం: భారత్ బయోటెక్

author img

By

Published : Nov 16, 2020, 3:37 PM IST

ప్రస్తుతం నాజల్ డ్రాప్ వ్యాక్సిన్​పై పని చేస్తున్నామని భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా వెల్లడించారు. ఈ టీకాతో బిలియన్ డోసుల ఉత్పత్తి సులభతరమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డక్కన్ డైలాగ్ చర్చా కార్యక్రమంలో ఆయన వివరించారు. కొవాగ్జిన్​ ను దేశంలో అందరికీ అందుబాటులోకి తీసుకురావడం చాలా కష్టమని... దీనిని దృష్టిలో ఉంచుకొని నాజల్ డ్రాప్ వ్యాక్సిన్​పై కృషి చేస్తున్నామని తెలిపారు.

నాజల్ డ్రాప్​ వ్యాక్సిన్​పై కృషి చేస్తున్నాం: భారత్ బయోటెక్
నాజల్ డ్రాప్​ వ్యాక్సిన్​పై కృషి చేస్తున్నాం: భారత్ బయోటెక్

నాజల్ డ్రాప్​ వ్యాక్సిన్​పై కృషి చేస్తున్నాం: భారత్ బయోటెక్

కరోనా వైరస్‌కు సంబంధించి ముక్కులో వేసుకునే చుక్కల మందు (నాజల్ డ్రాప్ వ్యాక్సిన్)పై ప్రయోగాలు చేస్తునట్టు భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్లా తెలిపారు. హైదరాబాద్​లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆన్​లైన్​లో నిర్వహించిన డక్కన్ డైలాగ్ చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం మూడో విడత క్లినికల్ ట్రయల్స్​లో ఉన్న కొవాగ్జిన్ రెండు డోసుల ఇండక్టేబుల్ టీకా అని... దీనిని దేశంలో అందరికీ అందించాలంటే 260 కోట్ల ఇంజెక్షన్స్ అవసరం అవుతాయని పేర్కొన్నారు. ఇది చాలా కష్టమని, దీనిని దృష్టిలో ఉంచుకొని నాజల్ డ్రాప్ వ్యాక్సిన్​పై కృషి చేస్తున్నామని వివరించారు. ఈ తరహాలో బిలియన్ డోసుల ఉత్పత్తి... పంపిణీ చేయటం సులభతరమని ఆయన అన్నారు.

ఇప్పటికే రోటా వైరస్​లో ఇలాంటి వ్యాక్సిన్​పై అనుభవం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఏకైక బీఎస్ఎల్ 3 ఉత్పత్తి కేంద్రం తమ కంపెనీకి ఉందని ఆయన వెల్లడించారు. చైనా ఇప్పుడు ఇలాంటి కేంద్రాన్ని నిర్మిస్తోందని తెలిపారు.

ఇదీ చదవండి: 'ఆగస్టు కల్లా 25 కోట్ల మందికి కొవిడ్​ టీకా'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.