ETV Bharat / city

ప్రధానవార్తలు @9AM

author img

By

Published : Aug 7, 2022, 8:58 AM IST

9AM TOP NEWS
ప్రధానవార్తలు @9AM

..

  • పెద్దలసభకు 'సమయం' నేర్పిన నేత.. పారదర్శకతకు పెద్దపీట

పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు.. పెద్దలసభ నిర్వహణలో తనదైన ముద్ర వేశారు. జవాబుదారీతనాన్ని తీసుకొచ్చి.. అతి తక్కువ ఉత్పాదకతతో పనిచేస్తున్న సభకు పునరుత్తేజాన్ని తెచ్చారు. ఆయన హయాంలో రాజ్యసభ పనితీరు, ఎదురైన సవాళ్ల గురించి ప్రత్యేక కథనం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అక్కడ అంత్యక్రియలు చేయాలంటే.. నదిలో శవాన్ని మోసుకెళ్లాల్సిందే!

గుజరాత్​లోని భరూచ్​ జిల్లా.. దెహలీ ప్రజలు తమ గ్రామంలో మరణించిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు జరపడానికి నానాపాట్లు పడుతున్నారు. గ్రామ పరిసరాల్లో ప్రవహిస్తున్న కిమ్​ నదికి అవతలి వైపు గ్రామానికి సంబంధించిన స్మశాన వాటిక ఉంది. దీంతో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. మృతదేహాన్ని అందరూ గట్టిగా పట్టుకుని భయంభయంగా నదిని దాటుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చిట్టి ఉపగ్రహాలకు చిన్న వాహకనౌక.. నేడే నింగిలోకి ప్రయాణం

అమృతోత్సవ వేళ ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించనుంది. తాను కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ను నింగిలోకి ఎక్కుపెట్టింది. సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం దీనిని ప్రయోగించేెందుకు సర్వం సిద్ధమైంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇంకా కన్నీళ్లతో సావాసమే..

అన్నమయ్య ప్రాజెక్టు బాధితుల గోడు అరణ్యరోదనే అవుతోంది. తినడానికి తిండి లేక, ఉండడానికి నీడ లేక నానా కష్టాలు పడుతున్నారు. బాహుదా నదిపైనున్న పింఛా ప్రాజెక్టు నుంచి తెల్లవారుజామున ఒక్కసారిగా ఉద్ధృతంగా వచ్చిన వరదతో ప్రాజెక్టు నామరూపాలను కోల్పోయింది. వరద ఏకంగా 39 మందిని పొట్టన పెట్టుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సైబరాబాద్‌ను చూసినప్పుడు నాకెంతో సంతృప్తి: చంద్రబాబు

మంచి విధానాలతో ప్రజలకు ఎలా మేలు జరుగుతుందో చెప్పడానికి వాజ్‌పేయీ హయాంలో నిర్మించిన స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారులు, తాను తీసుకొచ్చిన ఐటీ విధానాలే నిదర్శనమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. దిల్లీలో ఆయన జాతీయ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తిరుపతి జిల్లాలో దారుణం..

తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం వృద్ధాప్యంలో ఉన్న కన్న తల్లి జ్ఞానమ్మ (60)ను కొడుకు నరసింహులు కత్తితో అతి కిరాతకంగా నరికి హత్య చేశాడు. మృతురాలు జ్ఞానమ్మకు మొత్తం ముగ్గురు పిల్లలు. భర్త రెండేళ్ల క్రితం చనిపోవడంతో పెద్ద కుమారుడు వద్దే ఉంటుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కమ్ముకున్న యుద్ధమేఘాలు.. గాజాపై బాంబుల వర్షం.. 24మంది దుర్మరణం

ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు అలముకుంటున్నాయి. శుక్రవారం గాజాపై వైమానిక దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్.. శనివారమూ భీకరంగా విరుచుకుపడింది.గాజాసిటీతో పాటు వివిధ నగరాలపై బాంబుల వర్షం కురిసింది. పాలస్తీనా ఇస్లామిక్‌ జిహాద్‌ (పీఐజె) ఉగ్రవాదులు లక్ష్యంగా యుద్ధవిమానాలు విరుచుకుపడ్డాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'మెటావర్స్​ సేవలకు త్వరలో పైలట్ ప్రాజెక్ట్.. అన్ని రంగాలకు విస్తరణ'

మెటావర్స్​.. ఇప్పుడు ఎక్కడా చూసిన ఇదే ట్రెండ్​. వర్చువల్​ వరల్డ్​ అనుభూతిని పొందేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మనం ఉన్నచోటే ఉండి.. ఎక్కడికో వెళ్లి అక్కడి అనుభూతులను స్వయంగా అనుభవించేలా చేసేదే ఇది. త్వరలోనే ఇటువంటి సేవలకు సిద్ధమని హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీస్‌ కంపెనీ వ్యవస్థాపకుడు, ప్రోడక్ట్‌ ఇంజినీరింగ్‌ సేవల అధిపతి జోసెఫ్‌ అనంతరాజు అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రెజ్లింగ్​లో పతకాల పంట.. మరో నలుగురికి గోల్డ్​

కామన్వెల్త్​ గేమ్స్​లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. రెజ్లింగ్​లో పతకాల పంట పండిస్తున్నారు కుస్తీ వీరులు. ఇప్పటికే ముగ్గురు భారత రెజ్లర్లు బజరంగ్​ పునియా, దీపక్​ పునియా, సాక్షి మాలిక్​ గోల్డ్​ మెడల్స్​ సాధించగా.. శనివారం భారత్​ను మరో నాలుగు స్వర్ణాలు వరించాయి. పురుషుల ఫ్రీస్టైల్​ 57 కేజీల విభాగంలో రవి దహియా, 74 కిలోల విభాగంలో నవీన్​ బంగారు పతకం సాధించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో కష్టతరమైన పాత్ర ఆయనదే: పరుచూరి గోపాలకృష్ణ

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఆర్ఆర్ఆర్​ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తారక్ పాత్ర నిడివి తక్కువగా ఉండటంపై స్పందించారు. ఈ సినిమాలో ఎవరి పాత్ర కష్టమనే విషయాన్ని వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.