Murder: తిరుపతి జిల్లాలో దారుణం.. తల్లిని నరికి చంపిన కుమారుడు
Updated on: Aug 6, 2022, 10:27 PM IST

Murder: తిరుపతి జిల్లాలో దారుణం.. తల్లిని నరికి చంపిన కుమారుడు
Updated on: Aug 6, 2022, 10:27 PM IST
21:52 August 06
property disputes: ఆస్తి తగాదాలే కారణమంటున్న బంధువులు
Son kills mother: తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం వృద్ధాప్యంలో ఉన్న కన్న తల్లి జ్ఞానమ్మ (60)ను కొడుకు నరసింహులు కత్తితో అతి కిరాతకంగా నరికి హత్య చేశాడు. మృతురాలు జ్ఞానమ్మకు మొత్తం ముగ్గురు పిల్లలు. భర్త రెండేళ్ల క్రితం చనిపోవడంతో పెద్ద కుమారుడు వద్దే ఉంటుంది. నిందితుడు నరసింహులు బేల్ధారి పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. నిందితుడు తరచూ ఆస్తి కోసం తల్లితో ఘర్షణ పడేవాడు. తనను కాదని కుమార్తెకు ప్రాధాన్యత ఇస్తుండటంతో తల్లిపై ద్వేషం పెంచుకున్నాడు. ఎలాగైనా తన తల్లిని అంతమొందించాలన్న కసితో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న కన్నతల్లిపై కత్తితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
- విజయవాడలో కారు బీభత్సం.. పిల్లలపైకి దూసుకెళ్లి
- పోలీస్‌స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లి.. కానిస్టేబుల్‌పై మూక దాడి.. ఏం జరిగింది?
