ETV Bharat / city

ప్రధాన వార్తలు@5PM

author img

By

Published : Jul 21, 2022, 5:00 PM IST

ap topnews
ap topnews

.

  • పోలవరాన్ని రివర్స్‌గేర్‌లో వెనక్కి తీసుకెళ్తున్నారు: చంద్రబాబు..
    దేశంలో అప్పులు ఎక్కువగా చేసిన రాష్ట్రంగా ఏపీని మార్చేశారని.. తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలవరాన్ని రివర్స్‌గేర్‌లో వెనక్కి తీసుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. అన్నింటిపై ఛార్జీలు పెంచి ప్రజలపై భారాన్ని మోపారని మండిపడ్డారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ప్రభుత్వానికి ఎసరు పెట్టే వారిని వెంటనే తప్పించండి: మంత్రి ధర్మాన..
    శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్లపై మంత్రి ధర్మాన ప్రసాదరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మన ప్రభుత్వానికి ఎసరు పెట్టే వాలంటీర్లు ఉంటే వారిని వెంటనే తప్పించాలని వ్యాఖ్యానించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఆరోగ్యశాఖల మంత్రులు ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేస్తారా ?: మంత్రి అంబటి..
    మంత్రిగా తనకు సాంకేతిక అంశాలు తెలియాల్సిన అవసరం లేదు కానీ.. కామన్ సెన్సు మాత్రం ఉందని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. దేశంలో ఆరోగ్య శాఖల మంత్రులు ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేస్తారా ? అని ఆయన ప్రశ్నించారు. పోలవరం ఎత్తుతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదన్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • సోనియా, రాహుల్‌పై ఈడీ విచారణ కుట్రపూరితం: ఏపీసీసీ..
    సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ విచారణకు నిరసనగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టింది. వారిపై ఈడీ విచారణ కుట్రపూరితమని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ మూసేసిన కేసని వెల్లడించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • నడిరోడ్డుపై 'లిప్​ లాక్​ ఛాలెంజ్​'.. ప్రముఖ కాలేజీ విద్యార్థుల రచ్చ!..
    సోషల్ మీడియా ఛాలెంజ్​ల పేరిట బహిరంగ ప్రదేశాల్లో నానా రభస చేశారు ఓ ప్రముఖ కళాశాల విద్యార్థులు. యువతీయువకులు నడిరోడ్డుపై పోటీపడి ముద్దులు పెట్టుకోగా.. మిగిలిన వారు చుట్టూ చేరి కేరింతలు కొడుతూ, వారిని 'ఎంకరేజ్' చేశారు. చివరకు పోలీసులు ఏం చేశారంటే.. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • వాటి సంగతేంటి?'.. సోనియాకు 2 గంటల్లో ఈడీ 20 ప్రశ్నలు! కాంగ్రెస్​ పోరుబాట!!..
    నేషనల్​ హెరాల్డ్​ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ. రెండు గంటల్లోనే 20 ప్రశ్నలు సంధించింది. సోమవారం మళ్లీ రావాలని సమన్లు జారీ చేసింది. సోనియాను ఈడీ విచారణకు పిలవడంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సోనియాకు విపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • భారీ కటౌట్స్‌, డ్యాన్స్‌లు.. ట్రైలర్‌ వేడుకలో కేక పుట్టించిన 'లైగర్'​​ ఫ్యాన్స్..
    విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన 'లైగర్‌' సినిమా ట్రైలర్​ అదిరిపోయింది. ట్రైలర్ విడుదల నేపథ్యంలో విజయ్​ ఫాన్స్​ కేక పుట్టించారు. భారీ కటౌట్స్‌, డ్యాన్స్‌లతో అదరగొట్టారు. ట్రైలర్​ రిలీజ్​ సందర్భంగా విజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'వన్డే క్రికెట్​ అంతరించేలా ఉంది.. వాటిని తగ్గిస్తేనే మంచిది'..
    ఇకపై అంతర్జాతీయ షెడ్యూల్​లో వన్డేలకు ప్రాధాన్యం తగ్గిస్తే మంచిదని సూచించాడు దిగ్గజ బౌలర్​, పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​ వసీం అక్రమ్. ఇంగ్లాండ్​ ఆటగాడు బెన్​స్టోక్స్​ వన్డేల నుంచి తప్పుకోవడంపై స్పందిస్తూ.. అతడి నిర్ణయానికి మద్దతుగా నిలుస్తానని పేర్కొన్నాడు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • పెట్రోలుపై ఎగుమతి సుంకం ఎత్తివేత..
    పెట్రోలుపై ఎగుమతి సుంకాన్ని ప్రభుత్వం తొలగించింది. డీజిల్‌, విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ఎగుమతిపై, దేశీయంగా ఉత్పత్తిని చేసిన ముడిచమురుపై సుంకాన్ని తగ్గించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఇటలీ ప్రధాని రాజీనామా.. 17 నెలలకే ముగిసిన పాలన..
    ఇటలీ ప్రధాన మంత్రి మారియో ద్రాగి తన పదవికి రాజీనామా చేశారు. ఈ పదవీ కాలంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మారియో ద్రాగి ధన్యవాదాలు తెలిపారు.పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.