ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @3PM

author img

By

Published : Aug 9, 2022, 3:01 PM IST

top news
top news

.

  • Venkaiah Naidu : అందరివాడు.. అనితరసాధ్యుడు..!
    సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. రాజకీయ వారసత్వం లేదు. ఎటువైపు నుంచీ ఆ నేపథ్య బలమూ లేదు. కానీ.. నిబద్ధత, క్రమశిక్షణే ఆలంబనగా.. మహాత్ముల ఆశయాలు, ఆలోచనలే మార్గదర్శకాలుగా.. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎగిగారు వెంకయ్యనాయుడు. ఒకనాడు అడ్వాణీ, వాజపేయీ వాల్‌పోస్టర్లు అతికించిన సందర్భం నుంచి.. ఆ పార్టీ మొత్తం ఉపరాష్ట్రపతి పదవికి ఆయనే అర్హుడని ముక్తకంఠంతో తీర్మానించే వరకు తనదైన ముద్రవేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • పదవులకే వన్నె తెచ్చిన అవిశ్రాంత యోధుడు.. వెంకయ్య నాయుడు..
    మొక్కవోని వ్యక్తిత్వం.. విలక్షణ రాజకీయ జీవితం.. అమ్మ భాషపై అమితమైన ఆప్యాయత.. చతురత నిండిన వాక్చాతుర్యం.. అవన్నీ కలగలిస్తే.. ముప్పవరపు వెంకయ్యనాయుడు. జాతీయ రాజకీయ యవనికపై తెలుగువారి సంతకంలో.. చెరగని ముద్ర వేసిన మరో ఆణిముత్యం.. ఈ అందరి బంధువు. విద్యార్థి ఉద్యమాల నాయకత్వం నుంచి భారతదేశ 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి.. ఉపరాష్ట్రపతి పీఠం వరకు.. ఆయన ప్రతిప్రయాణంలోని ప్రతిఘట్టం అనితర సాధ్యమే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'సమాజానికి అండగా నిలిచేందుకు.. హుస్సేన్ త్యాగస్ఫూర్తిని అందుకుందాం'
    త్యాగానికి ప్రతీక మొహర్రం అని తెదేపా అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగం గుర్తు చేశారు. శాంతి స్థాప‌న‌కు ప్రాణత్యాగం చేసిన అమరులను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • Attacked on old couple: వృద్ధ దంపతులపై యువకుల దాడి.. ఎందుకంటే..?
    వృద్ధులు అనే కనికరం కూడా లేకుండా దంపతులపై ఇద్దరు యువకులు విచక్షణ రహితంగా దాడి చేశారు. వృద్ధులపై దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అసలేం జరిగిందంటే..? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • నితీశ్​ ప్లాన్​కు భాజపా కౌంటర్.. ఆ ఎమ్మెల్యేలపై వేటు!.. మరి ప్రభుత్వం ఏర్పాటు ఎలా?
    బిహార్​లో జేడీయూ ప్రణాళికలకు భాజపా కౌంటర్ వ్యూహాలు రచిస్తోంది. ఆర్జేడీతో కలిసి జేడీయూ ప్రభుత్వ ఏర్పాటుకు యత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో.. కమలదళం అలర్ట్ అయింది. ఆర్జేడీ ఎమ్మెల్యేలపై వేటు పడేలా పావులు కదుపుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • నాయకులెవరూ లేని వేళ 'అరుణో'దయం.. క్విట్​ ఇండియాకు శ్రీకారం
    ఆంగ్లేయుల జైలు నుంచి విడుదల అనగానే ఎవరైనా సంబరపడి వెళ్లిపోతారు. కానీ విడిచి పెట్టినా వందలమంది జైల్లో అలాగే ఉండిపోయారు. కారణం- అరుణ! మహాత్ముడి నుంచి మామూలు కార్యకర్త దాకా అందరినీ కదిలించిన స్వాతంత్య్ర సమరయోధురాలు అరుణా అసఫ్‌ అలీ! పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ట్రంప్ ఇంటిపై ఎఫ్​బీఐ దాడులు.. లాకర్లు బద్దలు.. ఆ రహస్య పత్రాల కోసమే?
    అమెరికా మాజీ అధ్యక్షుడి ఇంటిపై ఎఫ్​బీఐ దాడులు నిర్వహించింది. తన ఇంటిని ఎఫ్​బీఐ ఏజెంట్లు ఆక్రమించుకున్నారని.. లాకర్లను పగులగొట్టారని ట్రంప్ మండిపడ్డారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లను అడ్డుకోవాలన్న కుట్రతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • కొత్త రూల్స్​తో చెక్కులకు అదనపు భద్రత
    డిజిటల్‌ చెల్లింపులు జోరందుకున్నప్పటికీ.. అధిక విలువగల లావాదేవీలకు ఇప్పటికీ చెక్కులు కీలకంగానే ఉన్నాయి. చెక్కులో పేర్కొన్న మొత్తాన్ని దిద్దడం, ఫోర్జరీ సంతకాలు వంటి ఇబ్బందులున్నప్పటికీ.. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఇవి ఎంతో ప్రధానమైనవిగానే చెప్పొచ్చు. ఈ మోసాలకు తావు లేకుండా ఇప్పుడు పాజిటివ్‌ పే సిస్టమ్‌ (పీపీఎస్‌) అందుబాటులోకి వచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • హీరో నిఖిల్ టీమ్​కు షాక్.. పాక్ బోర్డర్లో షూటింగ్ చేస్తుంటే...
    హీరో నిఖిల్​.. నటించిన తాజా చిత్రం 'కార్తికేయ 2'. చందూ మొండేటి దర్శకుడు. వీరిద్దరి కాంబోలో వచ్చి సూపర్​హిట్​గా నిలిచిన 'కార్తికేయ'కు సీక్వెల్​గా మిస్టరీ థ్రిల్లర్​గా 'కార్తికేయ 2' రూపొందింది. శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఆగస్టు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • నీరజ్​చోప్రా 'గోల్డ్​మెడల్​' రికార్డ్​ బద్దలు.. ఎవరా అథ్లెట్​?
    కామన్వెల్త్‌ క్రీడల్లో భాగంగా జావెలిన్‌ త్రోలో ఓ అథ్లెట్‌ రికార్డు త్రో విసిరి అందర్నీ ఆకట్టుకున్నాడు. దీంతో భారత అథ్లెట్‌, ప్రపంచ నంబర్‌వన్‌ నీరజ్ చోప్రా కూడా షాక్​ అయ్యాడు! పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.