ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

author img

By

Published : Jul 13, 2022, 9:13 PM IST

9pm top news
9pm top news

...

  • CM Jagan review : ఆగస్టు 1 నుంచి ఆరోగ్యశ్రీలో మరిన్ని చికిత్సలు: సీఎం జగన్​

ఆరోగ్య శ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను మరింత పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. విలేజ్‌ క్లినిక్స్‌కు, పీహెచ్‌సీలకు డిజిటల్‌ వీడియో అనుసంధానత చేయాలన్నారు.

  • భవిష్యత్ తరాల కోసమే యుద్ధం.. వారితోనే నా పోరాటం: చంద్రబాబు

క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల నిర్మాణంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌ నియామకాలు కాని 30 నియోజకవర్గాలపై దృట్టిసారించి వారంలోగా నియామకాలు పూర్తి చేయాలన్నారు. ప్రకృతి నాశనమయ్యేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారన్న చంద్రబాబు.. ప్రకృతి విలయ తాండవం చేస్తే తట్టుకోలేమని హెచ్చరించారు.

  • ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

రాష్ట్రవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజామునుంచే సాయిబాబు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు.

  • Godavari Floods: గోదావరికి వరద ఉద్ధృతి... రేపు ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక!

గువ రాష్ట్రాల్లో వర్షాల వల్ల గోదావరి ఉద్ధృతి క్రమంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 15.07 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు. పెరుగుతున్న వరద దృష్ట్యా రేపు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు.

  • గుజరాత్​లో వర్ష బీభత్సం.. 14 మంది మృతి.. 'మహా'లో 89 మంది!

భారీ వర్షాలు గుజరాత్​, మహారాష్ట్ర రాష్ట్రాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాలకు మహారాష్ట్రలో 89 మంది ప్రాణాలు కోల్పోగా.. గుజరాత్​లో కేవలం 24 గంటల్లో 14 మంది చనిపోయారు. రెండు రాష్ట్రాల్లోనూ అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి.

  • కొవిడ్ టీకా ప్రికాషన్​ డోస్ ఇక ఫ్రీ.. వారికి మాత్రమే!

కొవిడ్ టీకా ప్రికాషన్ డోసును ఈనెల 15 నుంచి ఉచితంగా అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 18-59 ఏళ్ల వయసు వారు ఇందుకు అర్హులని తెలిపింది.

  • లంకలో నిరసనకారుల దండయాత్ర.. సింగపూర్​కు రాజపక్స!

రాజకీయంగా, ఆర్థికంగా పెను సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక అట్టుడుకుతోంది. మరోసారి ఆ దేశంలో ఆందోళనలు పతాకస్థాయికి చేరుకున్నాయి. బుధవారం ఆందోళనకారులు ప్రధానమంత్రి కార్యాలయాన్ని అధీనంలోకి తీసుకున్నారు. అయితే ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు నియంతృత్వ శక్తులు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని విక్రమ సింఘే ఆరోపించారు.

  • 'ఒప్పో భారీ స్కామ్.. రూ.4,389కోట్ల కస్టమ్స్​ సుంకం ఎగవేత!'

స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. ఏకంగా రూ.4,389 కోట్ల కస్టమ్స్​ సుంకం ఎగ్గొట్టినట్లు డైరక్టరేట్​ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్​ వెల్లడించింది.

  • ICC Rankings: వన్డేల్లో బుమ్రా మళ్లీ నంబర్​ వన్​.. టీ20లో 5వ స్థానానికి సూర్య

ఐసీసీ ర్యాంకింగ్స్​లో జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్​ యాదవ్ అదరగొట్టారు. వన్డేల్లో బుమ్రా మరోసారి నంబర్​ వన్​ స్థానానికి చేరుకున్నాడు. టీ20లో సూర్యకుమార్ యాదవ్.. తన కెరీర్​లో అత్యుత్తమ 5వ స్థానానికి ఎగబాకాడు.

  • డేట్​ చేస్తానన్న జాన్వీ, సారా.. విజయ్​ దేవరకొండ రిప్లై భలే ఇచ్చాడుగా!

టాలీవుడ్‌ సెన్సేషల్‌ హీరో విజయ్‌ దేవరకొండతో డేట్‌ చేయాలని ఉందంటూ బాలీవుడ్‌ యువ నటి సారా అలీఖాన్‌ 'కాఫీ విత్ కరణ్​' షోలో తన మదిలోని మాట బయటపెట్టింది. అయితే దానిపై విజయ్‌ దేవరకొండ స్పందించారు. సోషల్​మీడియా ద్వారా ఆయన చేసిన పోస్ట్​ అభిమానులను ఆకర్షిస్తోంది. అదేంటంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.