ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM

author img

By

Published : Jun 7, 2022, 9:00 PM IST

9pm Top news of ap
9pm Top news of ap

.

  • వైకాపా ఇంటికెళ్లటం ఖాయం..: జేపీ నడ్డా
    ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యంతో రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు. కేంద్రం నిధులను రాష్ట్రం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన 'భాజపా గోదావరి గర్జన' సభకు హాజరైన ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వైఎస్సార్ యంత్రసేవా పథకం ప్రారంభం..
    వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్ల పంపిణీని సీఎం జగన్‌ ప్రారంభించారు. గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో జెండా ఊపి వాటిని ప్రారంభించారు. అనంతరం సీఎం స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతుల్లో ఉత్సాహాన్ని నింపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నాడు-నేడు అంటే లక్షలాది విద్యార్థులు ఫెయిల్ కావడమేనా ?: చంద్రబాబు
    పరీక్షల్లో తప్పామని ఆత్మహత్యల వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని పదో తరగతి విద్యార్థులకు చంద్రబాబు విజ్ఞప్తి చేసారు. వ్యవస్థలో లోపాలకు మీరు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రేపటినుంచే ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు
    రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు బదిలీ విధివిధానాలు తెలియజేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒకేచోట ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసిన వారికి రేపటి (జూన్ 8) నుంచి జూన్​ 17 వరకు బదిలీలకు అనుమతిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు.. రూ.2.82 కోట్ల నగదు,1.80 కిలోల బంగారం స్వాధీనం
    దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్​, ఆయన సన్నిహితుల నివాసాల్లో జరిపిన సోదాల్లో 2.82 కోట్ల రూపాయల నగదు, 1.80 కిలోల బరువున్న 133 బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఈడీ దాడులను ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ఖండించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సిద్ధూ కుటుంబానికి రాహుల్​ పరామర్శ.. పంజాబ్​ లాయర్ల కీలక నిర్ణయం!
    ఇటీవలే గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ పరామర్శించారు. పంజాబ్‌లోని మూసేవాలా ఇంటికి చేరుకున్న రాహుల్.. సిద్ధూ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కొవిడ్​ టెస్ట్​ల పేరుతో కోట్లు స్వాహా..
    ఒక్కరికి కూడా కరోనా పరీక్ష నిర్వహించలేదు. అసలు అతడికి కొవిడ్​ టెస్ట్​ సెంటరే లేదు. అయినా టెస్టుల పేరుతో.. ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించి ఏకంగా రూ. 46 కోట్లకుపైగా (6 మిలియన్​ డాలర్లు) కొల్లగొట్టాడు. చివరకు దొరికాడు. అసలేం జరిగింది? ఎలా జరిగింది? ఎలా చిక్కాడు?. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారీ నష్టాలతో ముగిసిన స్టాక్​ మార్కెట్లు..
    భారత స్టాక్​మార్కెట్లు మంగళవారం సెషన్​లో నష్టాలతో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 567 పాయింట్లు కోల్పోయి 55,107కు చేరగా ఎన్​ఎఈ నిఫ్టీ 153 పాయింట్లు తగ్గి 16,416 వద్ద స్థిరపడింది. మరోవైపు ఆయిల్​ అండ్​ గ్యాస్​, విద్యుత్​ రంగాలకు సంబంధించిన షేర్లను కొనుగోలు చేసేందకు మదుపర్లు ఆసక్తి చూపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్‌..
    రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించాడు ముంబయి జట్టు బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌. ఈ సీజన్​లోనూ పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తూ.. ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రికార్డును నెలకొల్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారీ ధరకు నయన్​-విఘ్నేశ్​ వెడ్డింగ్​ వీడియో రైట్స్​!
    హీరోయిన్​ నయనతార-దర్శకుడు విఘ్నేశ్​ శివన్ తమ పెళ్లికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఆ విషయాలివీ..పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.