ETV Bharat / bharat

సిద్ధూ కుటుంబానికి రాహుల్​ పరామర్శ.. పంజాబ్​ లాయర్ల కీలక నిర్ణయం!

author img

By

Published : Jun 7, 2022, 12:56 PM IST

Rahul Gandhi Siddu Moosewala Family: ఇటీవలే గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ పరామర్శించారు. పంజాబ్‌లోని మూసేవాలా ఇంటికి చేరుకున్న రాహుల్.. సిద్ధూ కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

సిద్ధూ కుటుంబాన్ని పరామర్శిస్తున్న రాహుల్​ గాంధీ
సిద్ధూ కుటుంబాన్ని పరామర్శిస్తున్న రాహుల్​ గాంధీ

Rahul Gandhi Siddu Moosewala Family: కాంగ్రెస్‌ సీనియర్​ నేత రాహుల్‌ గాంధీ మంగళవారం పంజాబ్‌లోని మాన్సా జిల్లాను సందర్శించారు. ఇటీవలే హత్యకు గురైన సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మంగళవారం ఉదయం చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్​.. నేరుగా సిద్ధూ స్వగ్రామమైన మూసాకు వెళ్లారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా, మాజీ డిప్యూటీ సీఎం ఓపీ సోనీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు రాహుల్​ వెంట ఉన్నారు. ఈ నేపథ్యంలో మూసేవాలా నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.

సిద్ధూ కుటుంబాన్ని పరామర్శిస్తున్న రాహుల్​ గాంధీ
సిద్ధూ కుటుంబాన్ని పరామర్శిస్తున్న రాహుల్​ గాంధీ

శనివారం మూసేవాలా తల్లిదండ్రులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అంతకుముందు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా మూసేవాలా కుటుంబ సభ్యులను కలిసి సంతాపం వ్యక్తం చేశారు. హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలని, తద్వారా కుటుంబానికి త్వరగా న్యాయం జరిగేలా చూడాలని సీఎం మాన్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రతాప్​ సింగ్ బజ్వా మంగళవారం లేఖ రాశారు. మరోవైపు, ఈ కేసులో నిందితుల తరపున న్యాయవాదులెవరూ వాదించకూడదని తాము తీర్మానించామని జల్లా లాయర్ల అసోసియేషన్​ తెలిపింది. సిద్ధూ కుటుంబానికి న్యాయపరంగా ఉచితంగా సహాయం చేస్తామని న్యాయవాదులు చెప్పారు.

మే29న సిద్ధూ మూసేవాలా(28) దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా దారిలో గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి.. సిద్ధూపై బుల్లెట్ల వర్షం కురిపించారు. అయితే గ్యాంగ్‌స్టర్‌ గొడవలు, హత్యల కారణంగానే సిద్ధూ మూసేవాలా హత్య జరిగినట్లు పంజాబ్‌ పోలీసు ఉన్నతాధికారి వీకే బవ్రా విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. గతేడాది అకాలీదల్‌ నాయకుడు విక్కీ మిద్దుఖేరా హత్య కేసులో మూసేవాలా మేనేజర్ పేరును లాగడం వల్ల సిద్ధూపై కక్షగట్టిన దుండగులు ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. సిద్ధూ అంత్యక్రియలు వేల మంది అభిమానుల మధ్య జరిగాయి. సిద్ధూ సొంత గ్రామమైన మాన్సా జిల్లాలోని మూసాలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ఇవీ చదవండి: ఇంజిన్ కింద కూర్చొని రైలు ప్రయాణం.. 190 కి.మీ వెళ్లిన తర్వాత!

భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని.. చేయి నరికేసిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.