ETV Bharat / city

AP TOPNEWS ప్రధానవార్తలు 9am

author img

By

Published : Aug 25, 2022, 8:59 AM IST

AP TOPNEWS
ప్రధానవార్తలు 9am

.

ఖరీదైన సలహా ఖజానా స్వాహా, వైకాపా ప్రభుత్వంలో ఎడాపెడా సలహాదారుల నియామకం

సీఎంకి ముఖ్య సలహాదారు ఒకరు, ఆయన కార్యక్రమాల సమన్వయానికి మరొకరు, ఆర్థిక వనరుల సమీకరణపై సలహాలకు ఇంకొకరు, వీరితో పాటు ప్రజావ్యవహారాల సలహాదారు, ప్రభుత్వానికి ముఖ్య సలహాదారు, రాష్ట్రంలో మీడియా వ్యవహారాలకు ఒకరు, జాతీయ మీడియా సలహాదారు మరొకరు. ఈ విధంగా సీఎంకి, ప్రభుత్వానికే రాష్ట్రంలో అరడజను మందికి పైగా సలహాదారులున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శ్రీకాంత్‌ నియామకంపై హైకోర్టు ఆగ్రహం, రాజ్యాంగేతర శక్తుల్లా సలహాదారులని వ్యాఖ్య

రాష్ట్రంలో సలహాదారుల నియామకాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సలహాదారులు రాజ్యాంగేతర శక్తుల్లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడింది. మంత్రులకు సలహాదారులను నియమిస్తే అర్థం చేసుకోగలం కానీ.. ప్రభుత్వ శాఖలకు సలహాదారులేమిటని నిలదీసింది. ఇలా సలహాదారులను నియమిస్తున్నారంటే ప్రభుత్వంలో అధికారుల కొరతేమైనా ఉందా అని ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి లేఖ

మద్యం, వివిధ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ తప్పుబట్టారు. ఇలా చేయడం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనను, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3)ను ఉల్లంఘించడమేనని ఆక్షేపించారు. వాటిపై చర్చించడానికి 25వ తేదీన దిల్లీకి రావాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెల 22న ఘాటుగా లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పరారవుతున్న ప్రేమజంటను పట్టుకున్న పోలీసులు, ఎలాగో తెలుసా

పాఠశాల దశలో చిగురించిన స్నేహం ప్రేమకు బాటలు వేసింది. అందరి ప్రేమికుల లాగే వీరికి పెద్దలు అడ్డుపడ్డారు. పెద్దలను ఒప్పించలేక, విడిపోయి బతకలేక ఇంట్లో నుంచి పారిపోవాలని నిర్ణయించుకుని, అనుకున్నదే తడవుగా ఇంటి నుంచి బయటపడ్డారు. కానీ వారి కలలు కొద్దిసేపటికే ఆవిరయ్యాయి. ఏమైందో తెలుసుకోవాలంటే ఇది చదవండి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది దుర్మరణం

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమకూరు జిల్లా శిరా తాలూకా బాలినహళ్లిలో లారీ, జీపు​ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని తుమకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • న్యాయానికి తెలుగు దివిటీ, అందరినీ ఆకట్టుకున్న సీజేఐ పనితీరు

భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో తెలుగు తేజంగా చరిత్ర పుటల్లో స్థానం దక్కించుకున్న జస్టిస్‌ ఎన్​వీ రమణ, తనపై ప్రజల అంచనాలను అందుకునేందుకు అహర్నిశలు శ్రమించారు. న్యాయ వ్యవస్థను వేధిస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి అవసరమైన మార్గాలూ సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బైడెన్​ సర్కార్​లో భారతీయుల హవా, 130 మందికి ఉన్నత పదవులు

అమెరికాలోని భారత సంతతికి చెందిన వ్యక్తులు అక్కడ సత్తా చాటుతున్నారు. జో బైడెన్​ ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో 130 మంది భారతీయులు ఉన్నత పదవుల్లో ఉన్నారు. అందులో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​ సహా సత్య నాదెళ్ల, సుందర్​ పిచాయ్​, శంతను నారాయణ్​ వంటి ప్రముఖులు ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బ్యాంకు బంపర్ ఆఫర్, ఫోన్ కొనుక్కునేందుకు రూ.2లక్షల అలవెన్సు

కొత్త మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ కొనుగోలుకు రూ.2 లక్షలు. అదీ ఒక్క ఏడాదికి తమ టాప్‌ మేనేజ్‌మెంట్‌కు ప్రభుత్వ రంగ బ్యాంకైన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కేటాయించిన అలవెన్సు మొత్తమిదీ. ఈ మేరకు సిబ్బంది సంక్షేమ ప్రయోజనాల నిబంధనలను సవరించారు. దీని ప్రకారం.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు ఈ మొత్తాన్ని కొత్త హ్యాండ్‌సెట్‌ కొనుగోలు కోసం ఇవ్వనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గిల్‌ 45 స్థానాలు జంప్, టెస్టుల్లో టాప్‌ 10లో రోహిత్​, పంత్​

ఇటీవల జింబాబ్వేతో ముగిసిన వన్డే సిరీస్‌లో రాణించిన టీమ్‌ఇండియా ఆటగాడు శుభమన్‌ గిల్ బుధవారం ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఏకంగా 45 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం అతడు 38వ స్థానంలో ఉన్నాడు. జింబాబ్వేతో జరిగిన 3 వన్డేల సిరీస్‌లో గిల్ 245 పరుగులు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో, కెప్టెన్‌ రోహిత్ శర్మ ఆరో స్థానంలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్న అవతార్​, ఆ ఎఫెక్ట్స్​తో సరికొత్తగా

అవతార్‌తో ప్రేక్షకుల్ని పండార గ్రహంలో విహరింపజేసిన జేమ్స్‌ కామరూన్‌, ఇప్పుడు అవతార్‌ 2తో మరో సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రపంచ సినీ ప్రియుల కోసం అవతార్​ మూవీని రీరిలీజ్ చేయడానికి సిద్ధమైంది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.