ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @5PM

author img

By

Published : Feb 3, 2022, 4:59 PM IST

5pm Top news
5pm Top news

.

  • 'చలో విజయవాడ' విజయవంతం.. ఈనెల 6నుంచి సమ్మెలోకి'
    రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతమైందని పీఆర్సీ సాధన సమితి నేతలు అన్నారు. ఈనెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సీఎం జగన్​తో సజ్జల, సీఎస్ భేటీ.. ఉద్యోగుల డిమాండ్లపై చర్చ
    మెరుగైన పీఆర్సీ కావాలంటూ ఉద్యోగులు నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావటంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ సమీర్ శర్మ సీఎం జగన్​తో భేటీ అయ్యారు. ఉద్యోగుల డిమాండ్లపై సమావేశంలో చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రభుత్వం అహంకారంతో కాకుండా.. ఆలోచనతో వ్యవహరించాలి: చంద్రబాబు
    ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనే ఉద్యోగుల విషయంలో జగన్ సర్కారు అనుసరించిన అణిచివేత తీరును తప్పుపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • హిందూపురం జిల్లా కేంద్రం చేయాలని.. రేపు బాలకృష్ణ మౌన దీక్ష
    హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రేపు మౌన దీక్ష చేయనున్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ.. రేపు ఉదయం పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నకిలీ కొవిషీల్డ్​ టీకాలతో కోట్ల రూపాయల దందా
    కరోనా నకిలీ టీకాలను తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు యూపీ పోలీసులు. వారి నుంచి నకిలీ కొవిషీల్డ్​, జైకొవ్​-డి వ్యాక్సిన్లు, టెస్టింగ్ కిట్స్​ను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కారు లైట్స్​ వెలుగులో పరీక్ష రాసిన 400 మంది విద్యార్థులు
    మధ్యాహ్నం 1.45కు మొదలు కావాల్సిన పరీక్ష సాయంత్రం నాలుగున్నరకు ప్రారంభమైంది. కాసేపటికే చీకటి పడిపోయింది. పరీక్ష కేంద్రంలో లైట్లు లేవు. అధికారులు కార్ల​ హెడ్​ లైట్స్​తో 'వెలుగు' నింపగా.. విద్యార్థులు అలానే పరీక్ష పూర్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సిరియాలో అమెరికా మెరుపు దాడి- 13 మంది పౌరులు బలి
    సిరియాలో ఉగ్రమూకలపై అమెరికా దళాలు జరిపిన దాడిలో 13 మంది పౌరులు మరణించారు. ఇందులో ఆరుగురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వరుస లాభాలకు బ్రేక్.. సెన్సెక్స్​ 770 మైనస్
    స్టాక్​ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 770 పాయింట్లు కోల్పోయి 58,788 వద్దకు దిగజారింది. నిఫ్టీ 219 పాయింట్లు క్షీణించి 17,560 పాయింట్ల వద్ద స్థిరపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • క్రికెటర్ కేఎల్​ రాహుల్​ ఇంట్లో పెళ్లి బాజాలు!
    టీమ్​ఇండియా వైస్​ కెప్టన్​ కేఎల్​ రాహుల్​ విండీస్​తో తొలి వన్డేకు దూరమయ్యాడు. రాహుల్​ ఇంట త్వరలో పెళ్లి వేడుకలు ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆ పనుల్లో రాహుల్​ బిజీగా ఉన్నాడని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆర్ఆర్ఆర్' రిలీజ్​కు కౌంట్​డౌన్.. 'మహాన్' ట్రైలర్ మాస్
    సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆర్ఆర్ఆర్, మహాన్, గంగూబాయ్ కతియావాడి చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.