ETV Bharat / city

CBN On Chalo Vijayawada: ప్రభుత్వం అహంకారంతో కాకుండా.. ఆలోచనతో వ్యవహరించాలి: చంద్రబాబు

author img

By

Published : Feb 3, 2022, 3:26 PM IST

chandrababu on chalo vijayawada : ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనే ఉద్యోగుల విషయంలో జగన్ సర్కారు అనుసరించిన అణిచివేత తీరును తప్పుపట్టారు. శాంతియుత నిరసనలకు వస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల సంఘాల నేతలను తీవ్రవాదుల్లా అరెస్టులు చేశారని చంద్రబాబు ఆక్షేపించారు. ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వం అహంకారంతో కాకుండా ఆలోచనతో వ్యవహరించాలని సూచించారు.

chandrababu
chandrababu

chandrababu on chalo vijayawada : చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనే ఉద్యోగుల విషయంలో జగన్ సర్కారు అనుసరించిన అణిచివేత తీరును తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులను ముందస్తు అరెస్టులు చెయ్యడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఉద్యోగుల నిరసనలపై గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా నియంతృత్వంగా వ్యవహరించలేదని మండిపడ్డారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా అని ప్రశ్నించారు. శాంతియుత నిరసనలకు వస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల సంఘాల ప్రతినిధులను తీవ్రవాదుల్లా అరెస్టులు చేశారని చంద్రబాబు ఆక్షేపించారు.

  • చలో విజయవాడలో ఉద్యోగుల నిరసనలపై @ysjagan ప్రభుత్వ నియంతృత్వ తీరును ఖండిస్తున్నాను.ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా?విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సిఎం జగన్ సమాధానం చెప్పాలి.రివర్స్ పిఆర్సిని వెనక్కి తీసుకోవాలి..నియంతృత్వం వీడి పరిష్కారం చూపాలి.(1/5)

    — N Chandrababu Naidu (@ncbn) February 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

cbn on chalo vijayawada : పాఠశాలల వద్ద పోలీసు పహారా పెట్టి ఉపాధ్యాయులను నిర్భందించడం... విద్యార్థుల ముందు టీచర్లను అవమానించడమే అని చంద్రబాబు దుయ్యబట్టారు. ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వం అహంకారంతో కాకుండా ఆలోచనతో వ్యవహరించాలని సూచించారు. ప్రతి సందర్భంలోనూ ఉద్యోగులను అవమానించే విధంగా సీఎం జగన్ ప్రవర్తించడం వల్లనే ఈ స్థాయి నిరసనలు జరిగాయని మండిపడ్డారు. మాయ మాటలతో ప్రజలను, ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్....ఇప్పుడు అంకెల గారడీతో జీతాలు తగ్గించలేదని మళ్లీ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హమీలను ఉద్యోగులు ప్రశ్నించడమే తప్పా అని ప్రశ్నించారు. జగన్ విశ్వసనీయతపై.. ఉద్యోగులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పాడిన కొత్తలో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. తాము 43 శాతం ఫిట్​మెంట్ ఇచ్చామని కానీ జగన్ సర్కార్ ఐఆర్ కంటే తక్కువ ఫిట్​మెంట్ ఇచ్చి జీతాలు రికవరీ చెయ్యడం.. ఇలా దేశంలోనే ఇప్పటి వరకు జరగలేదని విమర్శించారు. ఉద్యోగులు కొత్త పీఆర్సీ వద్దు పాత జీతమే ఇవ్వండి అంటున్నారంటే....ప్రభుత్వం ఎలా మోసం చేసిందో అర్థంమవుతుందన్నారు. ప్రభుత్వం భేషజాలు పక్కన పెట్టి....ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెదేపా అధినేత చంద్రబాబు హితవు పలికారు.

ఇదీ చదవండి

ఉద్యోగుల మిలియన్​ మార్చ్​.. పని చేయని పోలీసు ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.