ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM

author img

By

Published : Jun 20, 2022, 4:58 PM IST

ప్రధాన వార్తలు @ 5 PM
5PM TOP NEWS

..

  • తోటలోకి దూసుకొచ్చి.. 8 మంది రైతులపై ఎలుగుబంటి దాడి!
    BEAR ATTACK : శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగిలో స్థానికులు, పశువులపై విరుచుపడింది. ఎలుగుబంటి దాడిలో ఎనిమిది మంది రైతులు, పది పశువులు తీవ్రంగా గాయపడ్డాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎలుగుబంటి దాడితో గ్రామంలో భయాందోళన పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్ర కేబినెట్ సమావేశం వాయిదా
    AP Cabinet Meeting Postpone: ఈనెల 22న జరగాల్సిన రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సమాచారాన్ని మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు.. సీఎస్ కార్యాలయం పంపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నరసరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీలో.. కేంద్ర ఇంటెలిజెన్స్ తనిఖీలు
    Secunderabad Violence: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్లపై దర్యాప్తు కొనసాగుతోంది. అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగాలపై ప్రకాశం జిల్లాకు చెందిన ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'చలో నర్సీపట్నం'కు అడ్డంకులు.. నేతల గృహనిర్బంధాలు..
    CHALO NARSIPATNAM: అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేతను నిరసిస్తూ.. తెలుగుదేశం శ్రేణులు 'చలో నర్సీపట్నం'కు పిలుపునిచ్చారు. అయ్యన్న కుటుంబానికి సంఘీభావంగా కొందరు తెలుగుదేశం నేతలు రాత్రంతా ఆయన ఇంట్లోనే ఉన్నారు. అయ్యన్నపాత్రుడే లక్ష్యంగా ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో నర్సీపట్నంను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడే తెదేపా నేతలను గృహనిర్బంధం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఒకే కుటుంబంలో 9 మంది మృతి.. ఆత్మహత్యా? లేక...
    ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అనుమానాస్పద రీతిలో మరణించడం మహారాష్ట్రలో కలకలం రేపింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో జరిగింది. ఇందుకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా.. వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అగ్నిపథ్'​పై విపక్షాలు భగ్గు.. 'ఆర్మీ అధికారులతో ఆ పని చేయిస్తారా?'
    అగ్నిపథ్ స్కీమ్​పై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. యువత పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోందని, దీనికి ప్రధానమంత్రే కారణమని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాన్ని సమర్థించేందుకు తొలిసారి ఆర్మీ ఉన్నతాధికారులను ఉపయోగించుకున్నారని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మరోవైపు, విపక్షాలే నిరసనలను ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. నిరసన చేస్తున్నవారిలో 90 శాతం మంది ఆర్మీలో చేరేందుకు అనర్హులని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కేబుల్​ కార్​కు రిపేర్.. గాల్లోనే 9 మంది.. అనేక గంటలు నరకం!
    హిమాచల్​ ప్రదేశ్​లోని ఓ పర్యటక కేంద్రంలోని రోప్​వేలో సాంకేతిక సమస్య తలెత్తింది. 11 మంది ఉన్న కేబుల్ కారు గాల్లోనే నిలిచిపోయింది. సహాయక బృందాలు రంగంలోకి దిగి ఇద్దరిని కాపాడాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్థిరంగా బంగారం ధర.. హైదరాబాద్​, విజయవాడలో నేటి లెక్క ఇలా...
    Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల పసిడి ధర రూ.52,670గా ఉంది. కిలో వెండి ధర రూ.62,734గా ఉంది. మరోవైవు ఇవాళ ఆద్యంతం ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు చివరకు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 237 పాయింట్లు, నిఫ్టీ 57 పాయింట్లు మెరుగుపడ్డాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టీ, బన్స్​ సప్లయర్​గా మాజీ క్రికెటర్.. కష్టాలు చూడలేక...
    ఆర్థిక సంక్షోభంతో పొరుగు దేశం శ్రీలంక అవస్థలు పడుతోంది. లక్షల మంది తిండలేక అలమటిస్తున్నారు. ఈ క్రమంలో తన చుట్టూ ఉన్న వారి ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చాడు ఆ దేశ మాజీ క్రికెటర్​ రోషన్ మహానమ. పెట్రోల్ బంక్​ల వద్ద గంటలు, రోజుల కొద్దీ బారులు తీరిన ప్రజలకు ఆహారాన్ని అందిస్తూ.. తన మంచి మనుసును చాటుకుంటున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రణ్​బీర్​ పోస్టర్​పై ఆలియా 'హాట్'​ కామెంట్​.. ఆసక్తికరంగా '7 డేస్‌ 6 నైట్స్‌' ట్రైలర్​
    కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్​ 'షంషేరా', ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో రానున్న '7 డేస్‌ 6 నైట్స్‌' చిత్రాల అప్డేట్లు ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.