ETV Bharat / city

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3PM

author img

By

Published : Sep 28, 2022, 3:00 PM IST

.

ఏపీ ప్రధాన వార్తలు
TOP NEWS 3PM

  • "ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌"లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది: సీఎం జగన్​
    RAMCO CEMENT : వరుసగా మూడో ఏడాది కూడా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని సీఎం జగన్​ అన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల వద్ద రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమను ఆయన ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చినశేషవాహన సేవ
    BRAHMOTSAVALU : తిరుమలలో బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామి వారు చినశేషవాహనం పై తిరుమల పురవీధుల్లో విహరించారు.
    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గోల్​కీపర్​గా రాణిస్తున్న సిక్కోలు యువతి.. ఒలంపిక్స్​లో పసిడే లక్ష్యంగా
    HOCKEY GOLL KEEPER : ఆటపై ఉన్న ఆసక్తితో అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగింది ఆ యువతి. నిరుపేద కుటుంబం, తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం.. ఆయన దూరమైనా పోరాడేలా చేసింది. ఫలితంగా భారత జూనియర్‌ హాకీ జట్టులో స్థానం పదిలం చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మహేష్​బాబు ఇంట తీవ్ర విషాదం.. ప్రముఖుల సంతాపం
    ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి, మహేశ్​బాబు మాతృమూర్తి మరణం పట్ల పలువురు సంతాపం తెలిపారు. ఆమె మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • విడాకులు అడిగిందని నడిరోడ్డుపై హత్య.. ప్రేయసిపై కోపంతో విషం తాగి ఆత్మహత్య
    మహారాష్ట్ర ముంబయిలో దారుణం జరిగింది. విడాకులు అడిగిందని భార్యను నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపాడో వ్యక్తి. మరో ఘటనలో తన ప్రేయసి సామాజిక మాధ్యమాల్లో కొంతమంది పురుషులను ఫాలో అవుతోందని ఆగ్రహించిన యువకుడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరొకరు అరెస్టు.. ఈడీ వలలో మహేంద్రు
    Delhi Liquor Scam: దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరొకరు అరెస్టయ్యారు. మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రును ఈడీ అరెస్టు చేసింది. కాగా, ఈ కేసుకు సంబంధించి మంగళవారం తొలి అరెస్టు నమోదైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రెస్టారెంట్​లో ఘోర అగ్ని ప్రమాదం- 17 మంది మృతి
    రెస్టారెంట్​లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించారు. ఈశాన్య చైనాలోని చాంగ్​చున్​లో జరిగిందీ దుర్ఘటన. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ధరలు ఇలా.. ఆగని రూపాయి పతనం
    Gold Rate Today : దేశంలో బంగారం ధర పెరిగింది. రూపాయి విలువ మరోసారి పడిపోయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భారత్​తో పాక్​ సిరీసా? వింతగా ఉందన్న బీసీసీఐ
    ECB India Pakistan Test : ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు చేసిన ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. తమ నిర్ణయం ఏమిటో స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనపై పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు కూడా ఆసక్తి చూపించలేదు. ఇంతకీ ఆ ప్రతిపాదన ఏంటంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • యాంకర్​తో అసభ్య ప్రవర్తన.. నటుడిపై తాత్కాలిక నిషేధం
    కేరళ నటుడిపై నిషేధం విధించింది ఆ రాష్ట్ర సినిమా నిర్మాతల సంఘం. సినిమా ప్రమోషన్​లో భాగంగా ఓ యాంకర్​తో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ నటుడెవరంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.