AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM
Published on: May 12, 2022, 12:59 PM IST

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM
Published on: May 12, 2022, 12:59 PM IST
..
- వలపు వలలో చిక్కి దేశ సమాచారం లీక్.. వాయుసేన అధికారి అరెస్ట్!
పాకిస్థాన్ మహిళ హనీట్రాప్‌లో చిక్కుకుని దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేసిన ఐఏఎఫ్ అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. అతడ్ని తక్షణమే సర్వీస్ నుంచి తొలగించినట్లు వెల్లడించారు.
- RAINS: 'అసని' బీభత్సం.. పొంగిపొర్లుతున్న వాగులు
RAINS: అసని తుపాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంటలు నేలరాలడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రహదారులన్నీ జలమయమయ్యాయి.
- 'గన్ కంటే ముందొస్తానని ప్రకటనలు ఇచ్చిన జగన్... ఇప్పుడు ఎక్కడ..?'
Nara Lokesh: గన్ కంటే ముందొస్తానని కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చి.. సొంత జిల్లాలో బాలికపై అత్యాచారం జరిగితే జగన్ ఎక్కడ అని నారా లోకేశ్ ప్రశ్నించారు. గర్భవతిని చేసిన నిందితులను కాపాడటమేనా.. ఆడబిడ్డలకు కల్పించే రక్షణ..? అని ట్విట్టర్ వేదికగా నిలదీశారు.
- AE Suspicious Death: నెల్లూరు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనుమానాస్పద మృతి.. అసలేమైంది..!
AE suspicious death: నెల్లూరు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఉరి వేసుకున్నట్లు కనిపించినా.. మృతదేహంపై గాయాలుండటంతో ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ భర్తపై సీబీఐ కేసు.. ఎందుకంటే..?
CBI case on Guntur chairperson husband: గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కత్తెర క్రిస్టీనా భర్త సురేష్‌పై.. సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. అక్రమంగా విదేశాల నుంచి నిధులు పొందారన్న అభియోగంపై ఈ కేసు నమోదైంది.
- లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
Road Accident in Maharashtra: 60 అడుగుల లోయలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ దుర్ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగింది. వివాహానికి హాజరై వస్తూ ప్రమాదానికి గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఝార్ఖండ్‌లో జరిగింది. యూపీలో జరిగిన మరో ఘటనలో ఐదుగురు మృతి చెందారు.
- విమానంలో 122 మంది.. టేకాఫ్ సమయంలో చెలరేగిన మంటలు!
విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగాయి. ఘటన సమయంలో విమానంలో 113 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం చైనాలో జరిగింది.
- పెరిగిన బంగారం, వెండి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
Gold Rate Today: బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
- 100 మీటర్ల హర్డిల్స్‌లో 'తెలుగమ్మాయి' జాతీయ రికార్డు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి.. సైప్రస్ అంతర్జాతీయ మీట్లో స్వర్ణ పతకం సాధించింది. 100 మీ హర్డిల్స్‌ను 13.23 సెకన్లలో పూర్తిచేసి ప్రథమ స్థానంలో నిలిచింది.
- 'ఆర్ఆర్ఆర్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
RRR OTT Release date: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పడింది. వాళ్లందరూ ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తోన్న 'ఆర్ఆర్ఆర్' డిజిటల్ ప్రిమియర్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.

Loading...