గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ భర్తపై సీబీఐ కేసు.. ఎందుకంటే..?

గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ భర్తపై సీబీఐ కేసు.. ఎందుకంటే..?
CBI case on Guntur chairperson husband: గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కత్తెర క్రిస్టీనా భర్త సురేష్‌పై.. సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. అక్రమంగా విదేశాల నుంచి నిధులు పొందారన్న అభియోగంపై ఈ కేసు నమోదైంది.
CBI case on Guntur chairperson husband: గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కత్తెర క్రిస్టీనా భర్త.. హార్వెస్ట్ ఇండియా సొసైటీ అధ్యక్షుడు కత్తెర సురేశ్‌పై సీబీఐ కేసు నమోదైంది. అక్రమంగా విదేశాల నుంచి నిధులు పొందారన్న అభియోగంపై దిల్లీలోని సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
హార్వెస్ట్ ఇండియా కార్యకలాపాల కోసం విదేశీ నిధులు స్వీకరించే క్రమంలో నిబంధనలు ఉల్లంఘించారని, పదవులను దుర్వినియోగం చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. చిన్న పిల్లల దత్తత, విదేశాలకు తరలింపుపై కూడా సురేశ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. సురేశ్ కార్యకలాపాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని.. గుంటూరు ఎస్పీ అరీఫ్ హఫీజ్‌కు జాతీయ బాలల హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది.
ఇదీ చదవండి:
