ETV Bharat / business

2024లో లాంఛ్​ కానున్న టాప్​-5 సూపర్ స్టైలిష్​ కార్స్ ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 5:09 PM IST

Upcoming Cars In India 2024 In Telugu : కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మరో 3-4 నెలల్లో మారుతి సుజుకి, టాటా, కియా, హ్యుందాయ్​, టయోటా కంపెనీలు.. తమ లేటెస్ట్ కార్లను విడుదల చేయనున్నాయి. మరెందుకు ఆలస్యం.. ఆ నయా కార్లపై మనమూ ఓ లుక్కేద్దాం రండి.

5 New Cars Launches Within The Next 3 to 4 Months In India
upcoming cars in India 2024

Upcoming Cars In India 2024 : కొత్త ఏడాదిలో స్టన్నింగ్ ఫీచర్స్​, స్టైలిష్ లుక్స్​తో.. పలు సరికొత్త మోడల్ కార్లు ఇండియన్​ మార్కెట్లోకి రానున్నాయి. వాటిలో కియా, టాటా, మారుతి సుజుకి, టయోటా, హ్యుందాయ్​లకు చెందిన కార్లు ఉన్నాయి. ఇవన్నీ మరో 3 - 4 నెలల్లో లాంఛ్ కానున్నాయి. అందుకే వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

1. Kia Sonet Car Features : కియా సోనెట్​ డిసెంబర్ 14న భారత్​ మార్కెట్లో లాంఛ్ కానుంది. ఈ సరికొత్త కాంపాక్ట్ ఎస్​యూవీని లేటెస్ట్ ఆపోజిట్​ యునైటెడ్ డిజైన్​ ఫిలాసఫీతో రూపొందించారు. ఫీచర్ల విషయానికి వస్తే.. టాప్​-ఎండ్​ కార్లలో ​ADASతో సహా, పలు స్పెషల్ ఫీచర్లను పొందుపరిచినట్లు తెలుస్తోంది. అలాగే దీనిలోని క్యాబిన్​ను కూడా సూపర్ ప్రీమియం క్వాలిటీతో రూపొందించినట్లు సమాచారం. ప్రస్తుతానికి దీని ధర ఇంకా ప్రకటించలేదు.

Kia Sonet
కియా సోనెట్​

2. Tata Punch EV Features : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. త్వరలోనే ఈ పంచ్ ఈవీ కారును ఇండియన్ మార్కెట్​లో లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. నెక్సాన్​ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీల మాదిరిగానే.. దీనిని కూడా జిప్​ట్రాన్​ టెక్నాలజీతో రూపొందించారు. ఈ ఎలక్ట్రిక్​ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. టాటా కంపెనీ ఈ ఈవీ కారు ఇంటీరియర్​లో పలు మార్పులు చేసింది. అంతేకాదు ఎక్స్​టీరియర్​ లుక్స్​లోనూ చాలా మార్పులు చేసినట్లు సమాచారం.

Tata Punch EV
టాటా పంచ్ ఈవీ

3. Maruti Suzuki Swift Features : ఈ న్యూ-జెన్ మారుతి సుజుకి స్విఫ్ట్ కారు ఇప్పటికే పలుమార్లు రోడ్లపై కనిపించింది. మారుతి సుజుకి ఈ కారును మరికొద్ది నెలల్లోనే భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కారు డిజైన్​ను సరికొత్తగా రూపొందించింది. అంతేకాదు కారు ఇంటీరియర్​లోనూ సరికొత్త ఫీచర్లు, టెక్నాలజీలను పొందుపరిచింది. అన్నికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ నయా మారుతి సుజుకి కారు 1.2 లీటర్ల మైల్డ్ హైబ్రీడ్ జెడ్ సిరీస్ ఇంజన్​ ఆప్షన్​తో వస్తుంది.

Maruti Suzuki Swift
మారుతి సుజుకి స్విఫ్ట్

4. Toyota Urban Cruiser Taisor Car Features : మారుతి సుజుకి ఫ్రాంక్స్​ వెర్షన్​ను ఆధారం చేసుకుని టయోటా అర్బన్ క్రూయిజర్ టైసర్​ను రూపొందించారు. కనుక ఈ రెండు కార్ల మధ్య కొద్దిపాటి కాస్మెటిక్ తేడాలు మాత్రమే ఉంటాయి. ఇక టయోటా కారులోని ఇంజిన్, ఫీచర్లు మొత్తం.. మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు మాదిరిగానే ఉంటాయి.

Toyota Urban Cruiser Taisor
టయోటా అర్బన్ క్రూయిజర్ టైసర్

5. Hyundai Creta Features : హ్యుందాయ్ కంపెనీ 2024 ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఈ క్రెటా కారును ఇండియన్ మార్కెట్​లో విడుదల చేసే అవకాశం ఉంది. హ్యుందాయ్​ ఈ నయా కారు ముందు భాగం డిజైన్​లోనూ సరికొత్త మార్పులు చేసింది. ఇంటీరియర్​లోనూ అనేక కొత్త ఫీచర్లను ఏర్పాటుచేసింది. అంతేకాదు ఈ కారులో లెవెల్-2 ADAS టెక్నాలజీని పొందుపరిచింది.

Hyundai Creta
హ్యుందాయ్ క్రెటా

కొత్త కారు కొనాలా? ఆ మోడల్​పై ఏకంగా రూ.3 లక్షలు డిస్కౌంట్​!

స్టన్నింగ్ ఫీచర్స్​తో టెస్లా Cybertruck లాంఛ్​ - 547 కి.మీ డ్రైవింగ్ రేంజ్ - ధర​ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.