ట్విట్టర్​లో మీ​ ఫాలోవర్స్​ తగ్గే అవకాశం.. ఇదే కారణం!

author img

By

Published : Dec 1, 2022, 5:12 PM IST

Updated : Dec 1, 2022, 5:34 PM IST

Twitter bans over 44K accounts for policy violations in India

ట్విట్టర్​ను కైవసం చేసుకున్నప్పటి నుంచి సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టిన ఎలాన్‌ మస్క్‌.. మరో కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్‌ ఖాతాల సంఖ్య భారీగా తగ్గనుందని ప్రకటించారు. స్పామ్‌ అకౌంట్‌ల తొలగింపుతో అనేక మందికి ట్విట్టర్​ ఫాలోవర్ల సంఖ్య గణనీయంగా పడిపోనుందని వెల్లడించారు.

Twitter Spam Accounts : ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత సంస్థాగత సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఎలాన్‌ మస్క్‌ మరో కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్‌ కొనుగోలుకు ముందే స్పామ్‌ ఖాతాలను ప్రక్షాళన చేస్తామన్న మస్క్‌.. ఆ పని జరుగుతోందని వెల్లడించారు.
ట్విట్టర్‌లో స్పామ్‌ ఖాతాల ప్రక్షాళన జరుగుతోందని.. దీని వల్ల ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గిపోయే అవకాశం ఉందని మస్క్‌ ట్వీట్‌ చేశారు. ట్విట్టర్​లో మీ ఖాతాలకు ఫాలోవర్ల సంఖ్య తగ్గినట్లు మీరు గమనిస్తే చింతించవద్దని ఆయన వెల్లడించారు. ట్విట్టర్​ నూతన సంస్కరణను చేపట్టామన్న మస్క్‌.. దీనివల్ల ట్విటర్‌ మరింత పారదర్శంగా మారుతుందని తెలిపారు.

ట్విట్టర్​లో ట్వీట్‌ చేయడానికి అక్షరాల పరిమితిని కూడా 280 నుంచి 1000కు పెంచాలని ఎలాన్‌ మస్క్ యోచిస్తున్నారు. ఇటీవల ట్విట్టర్​లో ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు స్పందించిన మస్క్‌.. అక్షరాల పరిమితిని వెయ్యికి పెంచే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ట్విట్టర్​.. ఇతర సోషల్‌ మీడియాల మధ్య ప్రధాన వ్యత్యాసాలలో అక్షరాల పరిమితి కూడా ఒకటని మస్క్‌ వెల్లడించారు. తొలుత ఈ పరిమితిని 280 నుంచి 420కు పెంచాలని తన టీమ్‌కు సూచించిన మస్క్‌.. క్రమంగా దానిని వెయ్యికి పెంచాలని నిర్దేశించినట్లు తెలుస్తోంది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో వేచి చూడాలి.

40 వేల ఖాతాలు బ్యాన్​..
సెప్టెంబర్​ 26 నుంచి అక్టోబరు 25 మధ్య భారతదేశంలో పిల్లల లైంగిక దోపిడీని ప్రోత్సహిస్తున్న 44,611 ​ఖాతాలను ట్విట్టర్ బ్యాన్​ చేసింది. అంతకుముందు ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 25 మధ్య 50 వేలకుపైగా ఖాతాలను నిషేధించింది.

Last Updated :Dec 1, 2022, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.