టాటా ఫ్యూచర్ ప్లాన్ అదుర్స్.. మార్కెట్లోకి కొత్తగా 13 కార్లు!

author img

By

Published : Mar 11, 2023, 7:05 AM IST

tata-upcoming-13-cars

టాటా కంపెనీ సరికొత్త కార్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఇప్పుడున్న కార్లను అధునాతనంగా తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. వచ్చే మూడేళ్లలో 13 కొత్త కార్లను ప్రవేశ పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆ ఆప్​కమ్మింగ్​ కార్ల గురించి తెలుసుకుందాం.

టాటా కంపెనీ మరిన్ని కొత్త మోడళ్లతో కార్లతో వినియోగదారుల ముందుకు రానుంది. అందులో నెక్సాన్​, హారియర్​, సఫారి వంటి మోడళ్లు సైతం ఉన్నాయి. వీటిని కూడా సరికొత్తగా తయారు చేయనున్నారు. ఇందులో క్సాన్, హారియర్ సఫారి ఫేస్‌లిఫ్ట్‌లతో పాటు కర్వ్​, అవిన్యా వంటి ఎలక్ట్రానిక్​ కార్లు కూడా ఉన్నాయి. మొత్తం 10 ఎస్​యూవీలు ఉండనున్నాయి. వచ్చే మూడేళ్లలో వీటిని విడుదల చేయనున్నారు.

1. టాటా అవిన్యా..
ఈ మోడల్​ కారును 2026లో మార్కెట్​లోకి తెచ్చేందుకు టాటా కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. ఇది జెన్​-3 ఆర్కిటెక్చర్​పై ఆధారపడి పనిచేస్తుంది. దీన్ని పూర్తి ఆధునికంగా రూపొందించనున్నారు. దీని వెడల్పు, ఎల్​ఈడీ లైట్ బార్, టీ లోగో, సూసైడ్ డోర్లు, తేలియాడే టెయిల్ లైట్ యూనిట్, పెద్ద గ్లాస్ రూఫ్, షార్ట్ ఓవర్‌హాంగ్‌లు, సస్​స్టైనబుల్​ మెటీరియల్‌లతో కూడిన విశాలమైన ఇంటీరియర్, డాష్‌లో ఇంటిగ్రేటెడ్ స్క్రీన్‌తో దీన్ని తయారు చేయనున్నారు.

2. టాటా హారియర్​ ఈవీ..
ఈ వచ్చే సంవత్సరం భారత్​లో లాంఛ్ చేసే అవకాశాల ఉన్నాయి. అద్భుతమైన స్టైలిష్​ డిస్​ప్లేతో ఈ కారు రానుంది. ఈ కారు డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటారు సెటప్‌ను కలిగి ఉంటుంది. టాటా కార్లలో జీరో-ఎమిషన్ ప్యాసింజర్ వెహికిల్​గా ఇది నిలునుంది.

3. టాటా సియెర్రా ఈవీ..
ఇప్పుడున్న సియెర్రా ఈవీ కారుతో పోలిస్తే కొన్ని మార్పులతో దీన్ని విడుదల చేయనున్నారు. 170 పీఎస్​ వేగంతో.. నెక్ట్స్​ జెన్​ 1.5 లీటర్ డీఐ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించిన మొదటి మోడల్‌గా ఇది నిలువవచ్చు.

4. టాటా సఫారి ఈవీ..
టాటా సఫారి కారులను కూడా ఎలక్ట్రానిక్​ వెహికిల్​ మార్చేందుకు టాటా ప్రయత్నాలు చేస్తోంది. ఇది వీలైనంతా తొందరగా మార్కెట్​లోకి విడుదల కావచ్చు.

5. టాటా కర్వ్​ ఈవీ..
ఇది ఎలక్ట్రిక్ వెర్షన్ కారు. దీని పొడవు నాలుగు మీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది జిప్ట్రాన్ సాంకేతికతతో పనిచేస్తుంది. ఏస్​ కర్వ్​ మోడల్​ కారు వలే క్యాబిన్ లోపల, బయట భాగాలు రూపొందించబడ్డాయి.

6. టాటా టియాగో ఈవీ బ్లిట్జ్..
ఇది ఎలక్ట్రానిక్​ కారు. ఇది 2024లో విడుదుల కానుంది. కొంచెం అప్​డేట్​ చేసిన అనంతరం ఈ కారును తీసుకురానున్నారు. రెగ్యులర్​ మోడల్​తో పోలిస్తే.. విజువల్​ అప్​డెట్​, బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తో దీని కొత్తగా తయారుచేశారు. బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌ క్రితం మోడల్​లానే ఉంటాయి.

7. టాటా ఆల్ట్రోజ్ రేసర్..
ఆల్ట్రోజ్ మోడల్​తో పోలిస్తే.. కారు బయట కొన్ని మార్పులను చేయనున్నారు. రీట్యూన్డ్ సస్పెన్షన్, స్పోర్టియర్ ఎగ్జాస్ట్ నోట్ వంటి మెకానికల్ అప్‌డేట్‌లు ఈ కారులో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

8. టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​..
ఈ మోడల్ కారు 2024లో విడుదల కానుంది. ఇప్పటికే రోడ్లపై దీన్ని టెస్టింగ్​ కూడా చేశారు. దీన్ని సరికొత్త మార్పులతో మార్కెట్​లోకి విడుదల చేయనున్నారు.

9. టాటా హారియర్ ఫేస్​లిఫ్ట్​..
టాటా హారియర్​ గత కొన్నేళ్లుగా మార్కెట్​లో ఉంది. కానీ దీనికి అమ్మకాలు అనుకున్నట్లుగా జరగడం లేదు. దీంతో హారియర్​కు కొన్ని మార్పులు తీసుకువచ్చి సరికొత్తగా వినియోగదారుల ముందుకు తెస్తున్నారు.

10. టాటా సఫారి ఫేస్​లిఫ్ట్​..
టాటా సఫారిని కూడా కొన్ని మార్పులతో తెచ్చేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఇది 2024లో లాంఛ్​ అయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్​ కారును పూర్తిగా మార్పులు చేయనున్నట్లు సమాచారం. కారు ముందు భాగంలో మార్పులు తెస్తోంది. కారు లోపల కూడా సరికొత్త ఫీచర్లను పరిచయం చేయనున్నారు.

11. టాటా కర్వ్​ ఏస్​..
నెక్సాన్ ప్లాట్‌ఫామ్​కు చేసిన మర్పుల ఆధారంగా దీన్ని రూపొందించారు. 2024 ప్రారంభంలో ఈ కారును విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఐసీ ఇంజన్​తో ఈ కారును కొత్తగా తయారు చేశారు. ఈ కారు 1.2ఎల్​ టర్బోచార్జ్​ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ ఫీటర్ కలిగి ఉన్న టాటా మొదటి మోడల్​గా ఇది నిలుస్తోంది.

12. టాటా పంచ్​ సీఎన్​జీ..
2023 చివర్లో ఈ కారును లాంఛ్​ చేస్తారు. 1.2లీటర్ పెట్రోల్ ఇంజిన్​ సామర్థంతో దీన్ని రూపొందించారు. చాలా వేరియంట్లలో ఈ మోడల్​ను అమ్మేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది.

13. టాటా ఆల్ట్రోజ్ సీఎన్​జీ..
ఇది కూడా ఈ సంవత్సరం చివర్లో అమ్మకాలకు సిద్ధంగా ఉంటుంది. ఇది ట్విన్ సిలిండర్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఒక్కొక్క దానికి 30 లీటర్ల సామర్థం ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.