ETV Bharat / business

Swiggy One Lite Membership Plan : రూ.99కే 'స్విగ్గీ వన్ లైట్'​ మెంబర్​షిప్​.. 3 నెలలు ఫ్రీ డెలివరీ సహా బోలెడు బెనిఫిట్స్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 5:57 PM IST

Swiggy One Lite Membership Plan In Telugu : స్విగ్గీ యూజర్లకు గుడ్​ న్యూస్​. స్విగ్గీ ఇప్పుడు కేవలం రూ.99కే వన్​ లైట్​ మెంబర్​షిప్​ ప్లాన్​ను అందిస్తోంది. దీని ద్వారా ఫ్రీ ఫుడ్ డెలివరీ సహా అనేక బెనిఫిట్స్ లభిస్తాయి. పూర్తి వివరాలు మీ కోసం..

LATEST Swiggy Membership Plan
Swiggy One Lite Membership Plan

Swiggy One Lite Membership Plan : ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్​ఫాం స్విగ్గీ తన కస్టమర్​ బేస్ పెంచుకునేందుకు ఓ సరికొత్త బడ్జెట్​ మెంబర్​షిప్ ప్లాన్​ను అందుబాటులోకి తెచ్చింది. అదే 'స్విగ్గీ వన్​ లైట్​'. కేవలం రూ.99కే ఈ 3 నెలల వ్యవధిగల మెంబర్​షిప్​ ప్లాన్​ను అందిస్తోంది. దీని ద్వారా ఫ్రీ ఫుడ్​ డెలివరీ సహా అనేక ఇతర ప్రయోజనాలను కూడా కల్పిస్తామని చెబుతోంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్విగ్గీ ఆఫర్స్​
Swiggy One Lite Offers : స్విగ్గీ వన్​ లైట్​ చందాదారులకు.. ఉచితంగా ఆహారం, సరకులు సరఫరా చేస్తారు. అలాగే పిక్​-అప్​, డ్రాప్​ సర్వీసులు కూడా అందిస్తారు. పైగా ఫ్రీ కొరియర్ సర్వీస్ కూడా ఉంటుంది. వీటి గురించి మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

  • స్విగ్గీ వన్​ లైట్ మెంబర్​షిప్​ ఉన్నవారు రూ.149 లేదా అంత కంటే ఎక్కువ విలువైన ఫుడ్ ఆర్డర్​ పెడితే​ వారికి ఉచిత డెలివరీ ఫెసిలిటీ లభిస్తుంది. ఇలా 10 ఆర్డర్ల వరకు ఫ్రీగా ఫుడ్ డెలివరీ చేస్తారు.
  • రూ.199 లేదా అంతకంటే ఎక్కువ విలువైన వస్తువులను ఆర్డర్ చేస్తే.. 10 ఫ్రీ ఇన్​స్టామార్ట్​ డెలివరీస్​ చేస్తారు.
  • స్విగ్గీ చైన్​లో దాదాపు 20,000 వరకు రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో రోజూ ఏదో ఒక ఆఫర్​ నడుస్తూనే ఉంటుంది. వీటికి తోడు స్విగ్గీ వన్ ​లైట్ మెంబర్స్​కు మరో 30 శాతం వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
  • రూ.60 కంటే ఎక్కువ విలువైన స్విగ్గీ జీనీ డెలివరీస్​పై 10 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తారు.

బ్రాండ్ కొలాబరేషన్​ : టెలికాం, బ్యాంకింగ్ సెక్టార్స్​లోని అనేక బ్రాండ్​లతో స్విగ్గీ భాగస్వామ్యం (కొలాబరేషన్​) ఏర్పరుచుకుంది. అందువల్ల సదరు కంపెనీలు తమ సొంత ఉత్పత్తులపై కూడా భారీగా డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తున్నాయి. దీని వల్ల స్విగ్గీ యూజర్లకు మరింతగా బెనిఫిట్స్ లభించే అవకాశం ఏర్పడింది.

ప్రస్తుతం భారత దేశంలో ఫుడ్​ డెలివరీ ప్లాట్​ఫాంలు మంచి ఊపులో ఉన్నాయి. జొమాటో, స్విగ్గీ లాంటివి తమ యూజర్లకు బెస్ట్ ఎక్స్​పీరియన్స్ ఇవ్వడం కోసం.. ఇప్పటికే ప్రీమియం మెంబర్​షిప్​ ప్లాన్స్​ను అందిస్తున్నాయి. అయితే తాజాగా స్విగ్గీ తెచ్చిన వన్​ లైట్​ మెంబర్​షిప్​ ప్లాన్ ఒక గేమ్​-ఛేంజర్​ అవుతుందని మార్కెట్​ నిపుణులు భావిస్తున్నారు.

ICICI Bank Festive Offers : ఐసీఐసీఐ బ్యాంక్​ పండుగ ఆఫర్స్​.. రూ.26 వేల వరకు డిస్కౌంట్స్!.. క్యాష్​బ్యాక్స్​ కూడా..

Top 5 Best Selling Smart Watches in Amazon Sale : తక్కువ ధరకే స్మార్ట్​వాచ్ కొందామనుకుంటున్నారా?.. అయితే అమెజాన్​ సేల్​లో వీటిపై ఓ లుక్కేయండి.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.