ETV Bharat / business

మరో ప్రభుత్వ సంస్థ విక్రయానికి గ్రీన్​ సిగ్నల్​

author img

By

Published : Apr 29, 2022, 7:45 PM IST

Updated : Apr 29, 2022, 8:48 PM IST

Disinvestment of Pawan Hans Limited: మరో ప్రభుత్వ రంగ సంస్థ విక్రయానికి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది కేంద్రం. స్టార్​9 మొబిలిటీ దాఖలు చేసిన బిడ్​కు ఓకే చేసింది.

Pawan Hans Limited
మరో ప్రభుత్వ సంస్థ విక్రయానికి గ్రీన్​ సిగ్నల్​

Disinvestment of Pawan Hans Limited: పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమంలో భాగంగా మరో ప్రభుత్వ సంస్థ విక్రయానికి గ్రీన్ సిగ్నల్​ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. పవన్​ హాన్స్​ సంస్థలోని మొత్తం 51 శాతం వాటాను అమ్మేందుకు సీసీఈఏ ఆధ్వర్యంలోని కమిటీ ఆమోదం తెలిపింది. రూ.211.14 కోట్లతో స్టార్​9 మొబిలిటీ ప్రైవేటు లిమిటెడ్​ దాఖలు చేసిన బిడ్​ను ఓకే చేసింది. సీసీఈఏ ఆధ్వర్యంలోని కమిటీలో కేంద్ర మంత్రులు నితిన్​ గడ్కరీ, నిర్మలా సీతారామన్​, జోతిరాదిత్య సింధియాలు ఉన్నారు.

పవన్​ హాన్స్​లోని కేంద్ర ప్రభుత్వం మొత్తం వాటాను విక్రయించేందుకు సీసీఈఏ 2016, అక్టోబర్​లోనే ఆమోద ముద్రవేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. గతంలో మూడుసార్లు బిడ్లు పిలిచినప్పటికీ కార్యరూపం దాల్చలేదని పేర్కొంది. గత మూడేళ్లుగా పవన్​ హాన్స్​ నష్టాలను చవిచూస్తోందని వెల్లడించింది. లావాదేవీల సలహాదారు, ఆస్తి విలువ అంచనా ప్రకారం రూ.199.02 కోట్లకు విక్రయించేందుకు నిర్ణయించినట్లు తెలిపింది. అత్యధిక ధరకు బిడ్​ దాఖలు చేసిన స్టార్​9 మొబిలిటీ.. కేంద్రం వాటాను కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

"గత ఏడాది డిసెంబర్​లో మూడు బిడ్లు దాఖలయ్యాయి. స్టార్​9 మొబిలిటీ ప్రైవేట్​ లిమిటెట్​(బిగ్​ ఛార్టర్​ ప్రైవేట్​ లిమిటెడ్​, మహరాజా ఏవియేషన్​ ప్రైవేట్​ లిమిటెడ్​, అల్మాస్​ గ్లోబల్​ ఆపర్చ్యూనిటీస్ ఫండ్​ ఎస్​పీసీ​ల కన్సార్టియం) రూ.211.14 కోట్లతో అత్యధిక ధర బిడ్​గా నిలిచింది. మిగిలిన రెండు బిడ్లు రూ.181.05, రూ.153.15 కోట్లకు దాఖలయ్యాయి. చివరగా స్టార్​9 బిడ్​కు కేంద్రం ఓకే చెప్పింది."

- కేంద్ర ఆర్థిక శాఖ

పవన్​ హాన్స్​ సంస్థ.. కేంద్ర ప్రభుత్వం, ఓఎన్​జీసీ నేతృత్వంలోని జాయింట్​ వెంచర్​. ఈ సంస్థ హెలికాప్టర్​, ఎయిరో మొబిలిటీ సేవలను అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి ఈ సంస్థలో 51 శాతం వాటా ఉండగా.. ఓఎన్​జీసీకి 49 శాతం ఉంది. గతంలోనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయించిన ధర, నిబంధనలకు తన మొత్తం వాటాను విక్రయించేందుకు ఓఎన్​జీసీ అంగీకారం తెలిపింది.

ఇదీ చూడండి: 'అప్పటికల్లా దేశీయ చిప్‌ల తయారీయే మా లక్ష్యం'

Last Updated : Apr 29, 2022, 8:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.