ETV Bharat / business

Personal Loan Problems: పర్సనల్​ లోన్ తీసుకోవటం మంచిదేనా..? సమస్యలేంటి..?

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 11:28 AM IST

Which Problems will Rise with Personal Loan : ఏదో అత్యవసర పరిస్థితిలో ఉంటారు. వెంటనే డబ్బు కావాలి. ఇలాంటి వారందరికీ ఈ రోజుల్లో కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్ "పర్సనల్ లోన్". మరి, వ్యక్తిగత రుణాలు తీసుకోవటం మంచిదేనా? దీనివల్ల ఏమైనా సమస్యలేమీ రావా..??

personal loan problem good or bad
Personal Loan Problems

Taking Personnel Loan is Good Idea? : తక్షణ ఆర్థిక అవసరాల నుంచి బయటపడటానికి చాలా మంది వ్యక్తిగత రుణాలు (Personal Loans) తీసుకుంటుంటారు. ఈ రుణాలు (Personnel Loans) ఎలాంటి పేపర్‌ వర్క్‌ లేకుండానే క్షణాల్లో వచ్చేస్తుండడంతో.. వెనక, ముందు ఆలోచించకుండా వేలకు వేలు లోన్ తీసుకుంటున్నారు. మరి, ఈ వ్యక్తిగత రుణాలు తీసుకోవటం మంచిదేనా..? సమయానికి చెల్లింపులు జరపకపోతే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయి..?, ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారు..? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పర్సనల్ లోన్ తీసుకోకపోవడమే మంచిదట!
Why not take a personal loan..?: కారణం ఏదైనా.. వ్యక్తిగత రుణాలు తీసుకోకూడదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు ఈ పర్సనల్ లోన్స్ వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశాలు ఏర్పడుతాయని తెలియజేస్తున్నారు. వ్యక్తిగత రుణాల స్థానంలో ఇతర రుణాలను తీసుకోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు. పర్సనల్ లోన్ ఎందుకు తీసుకోకూడదో తెలియజేస్తూ.. 5 రకాల కారణాలను వివరిస్తున్నారు.

Personal Loan Requirements : పర్సనల్​ లోన్ కావాలా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

1. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి
High Interest Rates: వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. పర్సనల్ లోన్స్‌లో బంగారు రుణాలు, వాహన రుణాలు, ఆస్తి రుణాలపై సుమారుగా వడ్డీ రేట్లు 24 శాతం వరకు ఉంటాయి. సరైన సమయంలో చెల్లించకపోతే రుణం మరింత ప్రియం అవుతుంది. దీనివల్ల మనం కట్టాల్సిన మొత్తం మరింత పెరుగుతుంది. దీంతో.. ఒక్కోసారి సమయానికి చెల్లింపులు చేయలేకపోవచ్చు. ఇదే జరిగితే డిఫాల్టర్ ముద్ర పడుతుంది. ఒక్కసారి డిఫాల్టర్ అని క్రెడిట్‌ స్కోరులో ముద్ర పడితే.. భవిష్యత్‌‌లో రుణాలు అందడం కష్టమవుతుంది.

2. ముందస్తు చెల్లింపు ఛార్జీలు చెల్లించాలి
Payment of Prepayment Charges: మీరు ఏదైనా అత్యవసరం రీత్యా పర్సనల్ లోన్ తీసుకున్నట్లయితే ప్రీ-పేమెంట్ ఛార్జీలు ఉంటాయి. అదే ఇతర రుణాలకు ముందస్తు చెల్లింపు ఛార్జీలు ఉండవు. కాబట్టి, రుణదాతలు డబ్బును రాబట్టుకొనేందుకు చట్టరీత్యా చర్యలు తీసుకొనే హక్కు ఉంటుంది. అరెస్ట్‌ వారెంట్‌ ఇష్యూ చేసేందుకు ప్రయత్నించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పర్సనల్ తీసుకునే ముందు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

పర్సనల్​ లోన్​ కావాలా?.. తక్కువ వడ్డీ రేటుతో రుణం ఇస్తున్న 10 బ్యాంకులు ఇవే!

3. క్రెడిట్ స్కోర్‌పై ఎఫెక్ట్‌..
Effect on Credit Score: రుణదాతలు వ్యక్తి ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు క్రెడిట్‌ స్కోర్‌‌ను ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే రుణం మంజూరు చేయాలంటే.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగానే నిర్ణయిస్తాయి. భవిష్యత్తులో రుణాల మంజూరు విషయంలో.. క్రెడిట్‌ స్కోర్‌ కీలక భూమిక పోషిస్తుంది. ఏదైనా అనుకోని పరిస్థితుల కారణంగా చెల్లింపులు చేయకపోతే.. అది మీ క్రెడిట్‌ స్కోర్‌ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

4. ప్రాసెసింగ్ ఫీజు చాలా ఎక్కువ
Processing Fees are Too High: గోల్డ్ లోన్‌లతో పోలిస్తే.. పర్సనల్ లోన్‌ల విషయంలో ప్రాసెసింగ్ ఫీజు చాలా ఎక్కువ. వ్యక్తిగత రుణాలు ప్రతికూలతను కలిగి ఉండటానికి ఇదొక కారణం. గడువులోగా రుణం చెల్లించకపోతే క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం పడడమే కాకుండా పెనాల్టీ సైతం విధించబడుతుంది. అదే జరిగితే మనం తీసుకున్న రుణం మరింత భారమవుతుంది.

5. ఆదాయ రుజువు తప్పనిసరి
Income Proof is Mandatory: వ్యక్తిగత రుణం పొందే విషయంలో ఆదాయ రుజువు చూపించాలి. ఇది లేకుండా మీరు పర్సనల్ లోన్ పొందే అవకాశమే ఉండదు. కచ్చితంగా ఆదాయ రుజువును చూపిస్తేనే రుణం మంజూరు చేస్తారు. అయితే, బంగారు రుణం, షేర్లపై రుణం, ఆస్తిపై రుణాల విషయంలో రుజువు చూపించాల్సిన అవసరం ఉండదు.

పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నారా? ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.