ETV Bharat / business

TATA Safari Harrier Facelift Price and Features : టాటా నుంచి సఫారీ, హారియర్ ఫేస్​లిఫ్ట్ కార్లు.. ధర, ఫీచర్స్ చూస్తారా..?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 12:45 PM IST

New Tata Safari, Harrier Facelift launched : ఈ దసరా పండగకు కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే.. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్.. అదిరిపోయే ఫీచర్స్​తో రెండు కార్లను మార్కెట్​లోకి దింపింది. టాటా కొత్త సఫారీ, హారియర్ ఫేస్​ లిఫ్ట్ కార్లు మార్కెట్​లోకి విడుదలయ్యాయి. మరి, వాటిపై మనమూ ఓ లుక్కేద్దామా..?

TATA Safari Harrier Facelift Price and Features
TATA Safari Harrier Facelift Features and Price

New Tata Safari, Harrier Facelift Cars Launched : దేశవ్యాప్తంగా ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ వాహన రంగ సంస్థలు కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఇప్పటికే చాలా ఆటోమొబైల్ కంపెనీలు తమ నయా మోడల్ బైక్​లు, కార్లను మార్కెట్​లోకి విడుదల చేశాయి. తాజాగా.. ప్రముఖ దేశీయ వాహన ఉత్పత్తి దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors).. సఫారీ, హారియర్ అప్​గ్రేడెడ్ వెర్షన్స్‌ను లాంచ్ చేసింది. ఏడు ఎయిర్ బ్యాగ్స్​ సహా సరికొత్త ఫీచర్లతో స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ) సఫారీ ఫేస్​లిఫ్ట్(Tata Safari Facelift 2023), ప్రీమియం SUV హారియర్‌ ఫేస్​లిఫ్ట్​(Tata Harrier Facelift 2023) కార్లను టాటా కంపెనీ అక్టోబర్ 17న మార్కెట్​లోకి విడుదల చేసింది. ఇంతకీ ఈ కార్లలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

Tata Safari, Harrier Facelift 2023 Launched : అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న టాటా మోటార్స్ SUV సఫారీ, హారియర్ ఫేస్​లిఫ్ట్ మోడల్స్ మార్కెట్​లోకి రానే వచ్చేశాయి. ఈ SUV టాటా సఫారి(Tata Safari), హారియర్(Tata Harrier) కొత్త వెర్షన్ కార్లు ఎన్నో అధునాత ఫీచర్స్‌ కలిగి ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే సఫారీ ఫేస్‌లిఫ్ట్, హారియర్ ఫేస్‌లిఫ్ట్ కార్లు గ్లోబల్ NCAPలో ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందాయి. ఇప్పటి వరకు భారత మార్కెట్లో పరీక్షించిన అన్ని వాహనాల్లో.. ఈ రెండు SUVలు పెద్దలు, పిల్లల భద్రత కోసం అత్యధిక గ్లోబల్ NCAP స్కోర్‌ను సాధించాయి. ఇక ఫీచర్లు, ధర ఎంతో ఇప్పుడు చూద్దాం.

Tata Safari, Harrier Facelift Features in Telugu : ఇంజిన్ విషయానికొస్తే.. గత వేరియంట్ల మాదిరిగానే కొత్త హారియర్, సఫారీ ఫేస్ లిఫ్ట్ మోడల్స్ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్​తోనే వస్తున్నాయి. 6-స్పీడ్ ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్ బాక్స్ ఈ కార్లలో ఉంటుంది. ఈ ఇంజిన్ 167.6 బీహెచ్ పీ శక్తిని, 350 ఎన్ఏ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇవి ఎకో, సిటీ, స్పోర్ట్‌ అనే మూడు డ్రైవ్ మోడ్‌లలో లభిస్తాయి.

Tata Upcoming Cars In India : అదిరే ఫీచర్లతో.. 500 కి.మీ రేంజ్​తో.. రానున్న టాటా 'ఈవీ' కార్స్ ఇవే!

Tata Safari, Harrier Facelift Price : డిజైన్ విషయానికొస్తే.. ఈ రెండు మోడల్స్ కొత్త ఫ్రంట్ ఫేస్​తో వస్తున్నాయి. వీటిలో హెడ్​లైట్ సెటప్​ను పూర్తిగా రీ-డిజైన్ చేశారు. హారియర్ 2023లో 12.30 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుపర్చారు. టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌తోపాటు టాటా మోటార్స్ లోగోను చూపించే బ్యాక్‌లిట్ ప్యానెల్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో ఈ నయా కారు వస్తోంది. అలాగే ఇందులో 10 జేబీఎల్ స్పీకర్స్ తో హార్మన్ సౌండ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు.

ఈజీ డ్రైవింగ్, ఈజీ పార్కింగ్ కోసం 360 డిగ్రీ కెమెరాను కూడా పొందుపర్చారు. హారియర్ వెర్షన్ 2023 టాటా సఫారీ కూడా ఫేస్‌లిఫ్ట్ ఫీచర్ కలిగి ఉంది. రెండు SUVలు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) టెక్నాలజీతో మార్కెట్​లోకి వచ్చాయి. ఇక ధర విషయానికొస్తే.. టాటా కొత్త సఫారీ ఫెస్​లిఫ్ట్ కార్ల ప్రారంభ ధర రూ.16.19 లక్షలుగా ఎక్స్​ షోరూమ్​ వద్ద ఉంది. అదే కొత్త టాటా హారియర్ ఫేస్​లిఫ్ట్ కార్ల ప్రారంభ ధర రూ.15.49 లక్షలుగా ఎక్స్​ షోరూమ్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.

Best Cars Under 10 Lakhs : దసరాకు కారు కొనాలా?.. రూ.10 లక్షల బడ్జెట్లో బెస్ట్ కార్లు ఇవే!.. ఫీచర్స్​ అదుర్స్​!

Cars Discounts In October 2023 : కొత్త కారు కొనాలా?.. ఆ కారుపై రూ.2 లక్షల వరకు డిస్కౌంట్​.. బెస్ట్ ఆఫర్స్​ కూడా!

Hyundai i10 Car For Only Rs 1 Lakh at Carwale : షాకింగ్ రేటు.. హ్యుందాయ్ ఐ10 కారు.. లక్ష రూపాయలకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.