మళ్లీ పెరిగిన పాల ధరలు.. లీటర్​కు రూ.2 పెంపు.. ఏడాదిలో నాలుగోసారి..

author img

By

Published : Nov 20, 2022, 4:35 PM IST

Updated : Nov 20, 2022, 5:10 PM IST

mother dairy milk increased

పాల ధరలను మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది మదర్ డైరీ. లీటర్​ ఫుల్​ క్రీమ్​ పాలపై రూ.1, టోకెన్​ పాలపై రూ.2 పెంచనున్నట్లు తెలిపింది.

సామాన్యులకు మరో షాక్​ తగిలింది. దిల్లీలో మరోసారి పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది మదర్ డైరీ. లీటర్​ ఫుల్​ క్రీమ్​ పాలపై రూ.1, టోకెన్​ పాలపై రూ.2 పెంచనున్నట్లు తెలిపింది. పెంచిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ ఏడాదిలో పాల ధరలను పెంచడం ఇది నాలుగోసారి. అంతకుముందు మార్చి, ఆగస్టు, అక్టోబర్​ నెలల్లో లీటర్​కు రూ. 2 చొప్పున పెంచింది. దిల్లీలో అత్యధిక పాల సరఫరదారుల్లో మదర్​ డైరీ ఒకటి. ఈ సంస్థ రోజుకు 30 లక్షల లీటర్లకు పైగా పాలు విక్రయిస్తోంది.

ఈ పెంపుతో లీటర్​ ఫుల్​ క్రీమ్​ పాల ధర రూ.64కు చేరగా.. టోకెన్​ పాల ధర రూ. 50కు చేరుకుంది. అయితే 500 మిల్లీలీటర్ల ప్యాకెట్​ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని సంస్థ ప్రతినిధి తెలిపారు. ముడి పాలను రైతుల నుంచి సేకరించే వ్యయం పెరగడం వల్లే ధరలు పెంచామని చెప్పారు. ఈ ఏడాది డిమాండ్​కు సరిపడా ఉత్పత్తి లేకపోవడం మరో కారణమని వివరించారు. దాణా ధరల పెరుగుదల, వాతావరణ సమస్యలతో పాల ఉత్పత్తి తగ్గిందని పేర్కొన్నారు. రైతులకు మంచి ధర చెల్లించి వినియోగదారులకు నాణ్యమైన పాల అందిస్తామన్నారు.

ఇవీ చదవండి: సామాన్యులకు షాక్, పాల ధరలు పెంపు

'ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో ఉన్నా.. భారత్ మాత్రం సేఫ్'

Last Updated :Nov 20, 2022, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.