ETV Bharat / business

Hyundai i10 Car For Only Rs 1 Lakh at Carwale : షాకింగ్ రేటు.. హ్యుందాయ్ ఐ10 కారు.. లక్ష రూపాయలకే!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2023, 3:10 PM IST

Hyundai i10 Car For Only Rs 1 Lakh at Carwale : సెకండ్ హ్యాండ్​లో కారు కొనుగోలు చేయాలని చూస్తున్నారా..? కండీషన్లో.. తక్కువ ధరలో మంచి బండి చేతికి రావాలని కోరుకుంటున్నారా..? అయితే.. ఇటువైపు ఓ లుక్కేయండి.

hyundai i10 car for only rs 1 lakh at carwale

Hyundai i10 Car For Only Rs 1 Lakh at Carwale : ఈ రోజుల్లో సొంత ఇల్లు తర్వాత అందరి ఆశ ఓ కారు. కొందరికి అది స్టేటస్ సింబల్ అయితే.. మరి కొందరికి కుటుంబ అవసరం. అందుకే.. ఏ మాత్రం అవకాశం ఉన్నా.. ఓ కారు కొనిపడేస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు మధ్యతరగతి జనాలు. అయితే.. షోరూమ్ కార్లు కొనాలంటే.. ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. అందుకే.. సెకండ్ హ్యాండ్ మీద ఓ లుక్కేస్తుంటారు జనాలు. మీరు కూడా ఇలాంటి మంచి కండీషన్​లో ఉన్న సెకండ్ హ్యాండ్ కారుగానీ కొనాలని చూస్తుంటే మాత్రం.. మీకు ఇక్కడ బెస్ట్ ఛాయిస్​లు ఉన్నాయి. ఇక, ఆలస్యం చేయకుండా అవేంటో చూసేయండి. వీలుంటే.. రయ్య్​మంటూ ఓ రౌంట్ వేసేయండి. నచ్చితే ఇంటికి తెచ్చేయండి.

ఇవాళ అంతా ఆన్​లైన్​ అయిపోయింది. కూరగాయల నుంచి కార్ల దాకా అన్నీ ఇంటర్నెట్​ నుంచే ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇదే కోవలో.. సెకండ్ కార్లను కూడా ఆన్​లైన్​ ద్వారా అమ్మే వెబ్​సైట్లు చాలానే వచ్చేశాయి. అలాంటి వాటిల్లో ఒకటే CarWale. ఇందులో కార్ల ధరలు తక్కువగానే ఉన్నాయన్నది మార్కెట్ మాట. ప్రత్యేకంగా i10 Magna మోడల్​ను బట్టి తక్కువ ధరకే వస్తోంది. మరి, ఆ రేట్లు, కార్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

దేశీయ వాహన మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందిన కార్లలో హ్యుందాయ్ ఐ10 ఒకటి. ఇందులో శక్తివంతమైన ఇంజన్‌ ఉంది. ఇది మరింత శక్తిని, టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో ఎక్కువ స్థలం ఉండడంతోపాటు అనేక ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. మార్కెట్‌లో దీని ధర దాదాపుగా రూ.6 నుంచి రూ.8 లక్షల వరకు ఉంటుంది. CarWale వెబ్​సైట్​లోని సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు తక్కువగా ఉన్నాయి.

Hyundai Car Discounts In September 2023 : కార్​ లవర్స్​కు గుడ్​ న్యూస్​.. హ్యుందాయ్​ మోడల్స్​పై భారీ డిస్కౌంట్స్​.. ఆ కారుపై ఏకంగా రూ.2 లక్షలు బెనిఫిట్​!

ముందుగా.. 2009 హ్యుందాయ్ ఐ10 మాగ్నా 1.2 మోడల్ గురించి చూద్దాం. ఇది కేవలం 26,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ కారు కండీషన్ చూసుకొని అంతా ఓకే అనుకుంటే కొనుగోలు చేసుకోవచ్చు. అయితే.. ఇందుకోసం నోయిడా వెళ్లాల్సి ఉంటుంది. ఈ కారును కొనుగోలు చేయడానికి మీరు కేవలం రూ. 1.1 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది.

2008 మోడల్​కు చెందిన హ్యుందాయ్ i10 మాగ్నా 1.2 కూడా కార్​వేల్​ వెబ్​సైట్​ వద్ద ఉంది. ఇది 81,000 కిలోమీటర్లు తిరిగింది. ఇది ఘజియాబాద్‌లో ఉంది. ఈ కారును సొంతం చేసుకోవాలంటే.. రూ.1.18 లక్షలు చెల్లించాల్సి ఉంది.

2009 మోడల్​కే చెందిన మరొక హ్యుందాయ్ i10 Magna 1.2 కారు కూడా అందుబాటులో ఉంది. ఈ కారు కూడా చక్కటి కండీషన్లో ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇది 67,500 కిలోమీటర్లు నడిచింది.

2010 హ్యుందాయ్ i10 Magna 1.2 మోడల్ రూ.1.4 లక్షలకు అందుబాటులో ఉంది. ఈ కారు 1,11,237 కిలోమీటర్లు తిరిగింది. ఈ విధంగా పలు కార్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కావాలనుకుంటే.. ఓ రౌండ్ వేసి రావడమే.

నోట్ : ధరల్లో కొద్దిపాటి వ్యత్యాసం ఉంటే ఉండొచ్చు.

Jeep Compass 2024 : 9.8 సెకన్లలో 100 కి.మీ వేగం.. సూపర్ ఫీచర్స్.. ఈ కారు చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.