ETV Bharat / business

How to get Virtual Credit Card : మీకు వర్చువల్ క్రెడిట్ కార్డు తెలుసా..? వెంటనే తెలుసుకోండి

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 5:11 PM IST

How to use Virtual Credit Card : మీకు క్రెడిట్ కార్డు తెలిసి ఉండొచ్చు. మరి.. వర్చువల్ క్రెడిట్ కార్డు గురించి తెలుసా..? దాని వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా..? అసలు ఎందుకీ కార్డు వినియోగంలోకి తెచ్చినట్టు..??

How to get Virtual Credit Card
How to get Virtual Credit Card

How to use Virtual Credit Cards in Telugu : ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. అవసరాలు.. జనాలను ఆ వైపుగా పురికొల్పుతున్నాయి. దీంతో.. అనివార్యంగా క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. అయితే.. సైబర్ నేరాలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో.. సురక్షితమైన ఆన్​లైన్ లావాదేవీల అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో.. బ్యాంకులు చేసిన ఆలోచనే వర్చువల్ క్రెడిట్ కార్డు(Credit Card) వీటినే వీసీసీ(VCC) అని కూడా పిలుస్తారు. ఇంతకీ.. వర్చువల్ క్రెడిట్ కార్డులు అంటే ఏమిటి? వీటిని ఎలా ఉపయోగించాలి? ఈ కార్డుల ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి..? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు (VCCలు) అంటే ఏమిటి?

What is Virtual Credit Cards : వర్చువల్ క్రెడిట్ కార్డ్ అనేది.. ఇప్పటి వరకూ వాడుతున్న కార్డులకు డిజిటల్ వెర్షన్​ అన్నమాట. ఈ కార్డులు డిజిటల్‌గా 16-అంకెలతో రూపొందించబడిన ఒక కోడ్‌ను కలిగి ఉంటాయి. వీటిని మనం ఇప్పుడు వాడుతున్న కార్డుల మాదిరిగానే వాడుకోవచ్చు. కాకపోతే.. వీటిని ఒకసారి మాత్రమే వాడగలం. లేదా.. 48 గంటల వరకు మాత్రమే వినియోగించగలం. ఆయా బ్యాంకుల నిబంధనల మేరకు సడలింపులు ఉంటాయి.

Virtual Credit Cards Usage in Telugu : వర్చువల్ క్రెడిట్ కార్డులు ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి. ఆయా బ్యాంకుల ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ద్వారా వీటిని క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని తీసుకోవాలనుకుంటున్న కస్టమర్లు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇక, మామూలు క్రెడిట్ కార్డు మాదిరిగానే.. వీటికి కూడా కార్డు నెంబర్, సీవీవీ నెంబర్, వాలిడిటీ డీటైల్స్ వంటివి ఉంటాయి.

వర్చువల్ క్రెడిట్ కార్డుల ప్రయోజనాలిలా (Virtual Credit Cards Benefits in Telugu) :

మెరుగైన భద్రత : ఈ వర్చువల్ క్రెడిట్ కార్డుల వల్ల ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు మరింత భద్రంగా ఉంటాయి. మనం ఆన్‌లైన్‌ చెల్లింపులు(Digital Payments) నిర్వహించేటప్పుడు వెండర్‌కు లేదా సదరు సంస్థకు మన క్రెడిట్ కార్డు వివరాలు తెలియవు. దీంతో.. మోసాలు జరిగే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇంకా.. కార్డు పోతుందనే భయం, ఎవరైనా చోరీ చేస్తారనే టెన్షన్ కూడా ఉండదు.

డేటా ఉల్లంఘనలప్రమాదం తగ్గుతుంది : VCCలను ఉపయోగించడం ద్వారా, వినియోగదారులు డేటా ఉల్లంఘనలకు గురికావడాన్ని తగ్గించుకోవచ్చు. VCCలు కార్డ్ హోల్డర్ వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని కలిగి ఉండవు. కాబట్టి వారి ఆర్థిక సమాచార భద్రత గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు.

సేవలు సులభం : ప్రాథమిక కార్డ్‌పై ప్రభావం పడకుండా.. VCCలను క్రియేట్ చేయవచ్చు.. సులభంగా రద్దు కూడా చేయవచ్చు.

అంతటా వినియోగం : VCCలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్​లో విస్తృతంగా వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ లావాదేవీలన్నింటికీ ఈ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించవచ్చు.

Credit Card Cashbacks Latest Update : మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? మీకో షాకింగ్​ న్యూస్..!​

Co Branded Credit Cards : కో బ్రాండెడ్​ క్రెడిట్​ కార్డ్స్​తో.. అదిరిపోయే బెనిఫిట్స్.. ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే?

క్రెడిట్‌ కార్డ్ ఫ్రీ అనుకుంటున్నారా? అయితే పొరబడ్డట్టే!

క్రెడిట్​ కార్డ్​తో నష్టం కాదు లాభమే! ఈ సింపుల్​ ట్రిక్స్​ పాటిస్తే చాలు!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.