ETV Bharat / business

రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం.. మరోసారి 'ఫెడ్​' వడ్డీ రేట్లు పెంపు

author img

By

Published : Jul 28, 2022, 8:15 AM IST

Updated : Jul 28, 2022, 8:52 AM IST

Fed raises Interest
ఫెడ్ వడ్డీ రేట్లు

fed interest rate hike: కీలక వడ్డీ రేట్లను పెంచుతూ అమెరికా ఫెడరల్ రిజర్వు నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు తెలిపింది. ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరిన నేపథ్యంలో రేట్ల పెంపునకే మొగ్గు చూపింది.

fed interest rate hike: అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ అందరూ ఊహించినట్లుగానే బుధవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) కీలక రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్ రేటు 2.25-2.75 శాతం శ్రేణికి చేరింది. 40 ఏళ్ల గరిష్ఠానికి చేరిన ధరల కట్టడి కోసమే, ఫెడ్ కఠిన వైఖరి అవలంబిస్తోంది. అయితే రేట్ల పెంపు వల్ల ఆర్థిక వ్యవస్థపై భారం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

మొత్తం మీద ఫెడ్ జూన్​-జులై నెలల్లో కలిపి 1.5 శాతం మేర వడ్డీ రేటు పెంచినట్లయింది. పాల్ వాకర్ ఫెడ్ ఛైర్​గా ఉన్నప్పుడు 1980ల్లో చేసిన పెంపు తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ రేటును 2 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్ఓఎమ్​సీ ప్రకటన వెల్లడించింది.

ఇవీ చదవండి: BSNLకు భారీ ప్యాకేజీ.. ఆదుకునేందుకు కేంద్రం నిర్ణయం

'అంతర్జాతీయ కరెన్సీగా రూపాయి'.. సాధ్యమేనా?

Last Updated :Jul 28, 2022, 8:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.